అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పోలీసులు శుక్రవారం నుండే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

ట్యాంక్ బండ్‌లోని బుద్ద భవన్ వద్ద ఆర్‌టిసి కార్మికులు, విపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. ఒక్క సారిగా 50మంది ట్యాంక్ బండ్ ‌పైకి దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మధ్యాహ్నం జెఏసి నేత అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు జెఏసి నేతలను హిమాయత్ నగర్‌ లిబర్టీ వద్ద  అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 170మందిని అరెస్టు చేసినట్లు సిపి అంజనీ కుమార్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కాగా