NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: అధికార పార్టీ ఎమ్మెల్సీ కే ఆ స్థాయిలో బెదిరింపులా?కడప జిల్లాలో ఏం జరుగుతోంది ?

Andhra Pradesh: కడప జిల్లాకు చెందిన ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీకి రాత్రయితే నిద్రపట్టని పరిస్థితి నెలకొంది.తన సొంత జిల్లాకు చెందిన ఈ నేతను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయించారు.ప్రమాణ స్వీకారం చేసి పది రోజులైనా కాకముందే ఆ నేతకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.దీంతో భీతిల్లిన సదరు ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించారు.వివరాల్లోకి వెళితే..

Ruling Party MLC Getting Threats in Andhra Pradesh
Ruling Party MLC Getting Threats in Andhra Pradesh

బి.సి ఎమ్మెల్సీని బెదరగొట్టేశారు!

ప్రొద్దుటూరుకు చెందిన రమేశ్ యాదవ్ ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు.మొదటిసారిగా కడప జిల్లాలో ఒక బీసీని ఎమ్మెల్సీ చేశామంటూ వైసిపి గొప్పలు చెప్పుకుంది. అయితే రమేశ్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చిన ఆనందం పదిరోజుల్లోనే ఆవిరైంది.ఆయన గత నెల ఇరవై వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.ఆ నాలుగు రోజులకే అర్ధరాత్రిపూట ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.ఇరవై అయిదు, ఇరవై ఆరు తేదీల్లో రాత్రి పూట మూడు ఇంటర్నెట్ నెంబర్ల నుండి ఫోన్లు వచ్చాయి.”ఎమ్మెల్సీ పదవి వచ్చిందని సంబరపడకు.. నువ్వు మా నాయకుడు తో సమానం అనుకుంటున్నావా? నీకు ప్రాణాలపై ఆశవుంటే ఊరు వదిలి వెళ్లిపో.లేకుంటే ఇటీవల ప్రొద్దుటూరులోనే హత్యకు గురైన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య సమాధి పక్కనే నిన్నూ సమాధి చేస్తాం” అని ఫోన్ చేసిన వారు ఆయనను బెదిరించారు.

పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు!

వరుసగా రెండు రోజులు ఈ తరహా బెదిరింపులు రావడంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రొద్దుటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నెంబర్లను కూడా పోలీసులకు తెలియజేశారు.ఎమ్మెల్సీ ఫిర్యాదుమేరకు ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇది జరిగిన మాట నిజమేనని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ధ్రువీకరించారు.ఎమ్మెల్సీ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్ నెంబర్లు కావడంతో సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాశామని,ఆ వివరాలు అందగానే ఆయన్ను బెదిరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

“మా నాయకుడు “అంటే ఎవరు?

నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన రమేశ్ యాదవ్ ను ఎందుకు.. ఎవరు బెదిరిస్తున్నారన్నది తేలాల్సి ఉంది.మా నాయకుడు తో సమానం అనుకుంటున్నావా అని ఎమ్మెల్సీకి ఫోన్ చేసిన వారు ప్రస్తావించడాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ నాయకుడు ఎవరో కూడా కనిపెట్టాల్సి ఉంది.ప్రొద్దుటూరులోనే వైసిపిలోని మరో ముఖ్యనేత ఈ విధమైన బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏదేమైనా ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీకి,అదీ ముఖ్యమంత్రి ఆశీస్సులున్న నేతకు ఈ స్థాయిలో బెదిరింపులు రావడం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే.

 

author avatar
Yandamuri

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju