Sid Sriram: సిద్ శ్రీరామ్ పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో అతను ఓ సంచనలమనే చెప్పి తీరాలి. తన వినూత్నమైన వాయిస్ తో యువతను మెస్మరైజ్ చేస్తున్న సింగర్ ఎవరన్నా వున్నారు అంటే, అది సిద్ శ్రీరామే. ప్రస్తుతం దక్షిణాదిలో అనేక పాటలు పడుతూ ముందుకు సాగిపోతున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీరామ్ పాట లేని సినిమా లేదనడంలో అతిశయోక్తి లేదు. చిన్నదైనా పెద్దదైనా ఏ సినిమా అయినా సరే సిద్ పాట ఉంటే చాలు ఆటోమేటిక్ గా సినిమాకు హైప్ వస్తోందనే ప్రక్రియ సిద్ కి బాగా పనికివచ్చింది.
Vitamin B9: ఈ ఫుడ్స్ తింటే.. ఈ విటమిన్ లోపం ఉండదు..!!
Sid Sriram: సిద్ శ్రీరామ్ సింగింగ్ పైన విమర్శలు:
శ్రీరామ్ మెలోడీ రుచి జనాలకు తెలియంది కాదు. అందుకే కొన్ని సినిమాలలో ఆయన పాడిన పాట్లకోసం సినిమాలకి వెళ్లిన మహానుభావులు చాలామంది వున్నారు. అయితే సిద్ శ్రీరామ్ వాయిస్ తో మ్యాజిక్ చేస్తారని ఒప్పుకుంటూనే.. తెలుగు పదాల ఉఛ్ఛారణ విషయంలో చాలామంది భాషాభిమానులు కామెంట్స్ చేస్తుంటారు. సిద్ పాటల్లో శ్రావ్యత వైవిధ్యం తప్ప ఇంకేమి ఉండదని పెదవి విరిచే ప్రేక్షకులు కూడా లేకపోలేదు. ఇంతకముందు అతను పాడిన తెలుగు సూపర్ హిట్ సాంగ్స్ విషయంలో ఇదే కంప్లయింట్ వచ్చింది.
PAWAN KCR: కాంగ్రెస్ పై పవన్.. బీజేపీపై కేసీఆర్..! 2014 సీన్ రిపీట్ అవుతుందా..?
సంగీత దర్శకులకి సూచన:
‘సర్కారు వారి పాట’ సినిమా పాట ‘కళావతి’ విషయంలో ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. ‘వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయ..” అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటలో దూకినాయా – మోగినాయా లాంటి పదాలకు ఒత్తులు చేర్చి సిద్ శ్రీరామ్ పాడిన తీరు భాషాభిమానులకు మింగుడు పడటం లేదు. గొంతు ఎంత బాగున్నా.. పలికే విధానం కూడా సంగీత దర్శకులు చూసుకోవాలి కదా అని అంటున్నారు. సంగీత దర్శకులతో పాటు గీత రచయితలుకూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భాషాభిమానులు సూచిస్తున్నారు.