NewsOrbit
న్యూస్

కొత్త జిల్లాలపై పుకార్లు..! ప్రభుత్వ వ్యూహమేనా..!?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వపరంగా కసరత్తు జరుగుతుండగానే మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఏర్పడనున్నాయి అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంతకుముందే రాష్ర్టంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని ప్రకటించారు.ఇందుకోసం సంబంధిత కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవై అయిదు జిల్లాలు ఏర్పడతాయని అందరూ భావించారు.అయితే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అరకులో ప్రత్యేక పరిస్థితులున్నందున ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడతాయని ప్రకటించారు.ఇప్పుడా సంఖ్య ఏకంగా ముప్పై రెండు కు పెరిగింది.ఈ జాబితాను ఎవ్వరు సోషల్ మీడియాలో విడుదల చేశారు?దీనికున్న అధీకృతమేమిటన్నది వెల్లడి కావడం లేదు.ఒకవేళ ఫేక్ జాబితా అయితే ఈపాటికి అధికారవర్గాలు స్పందించి ఉండేవంటారు.ఒకవేళ ప్రభుత్వమే ప్రజా నాడిని తెలుసుకునేందుకు దీన్ని లీక్ చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఆ లిస్ట్‌ ప్రకారం ఏర్పాటు కాబోతున్న కొత్త జిల్లాలు ఇవే.. పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం,విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట.అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు కాని ఏడు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయని అర్థం.పలాస,పార్వతీపురం,అమరావతి,మార్కాపురం,గూడూరు,మదనపల్లె,ఆదోని జిల్లా కేంద్రాలు కాబోతున్నాయని ఆ జాబితా సారాంశం.అయితే కొత్తగా ఏర్పాటు చేస్తారని చెబుతోన్న ఈ ముప్పై రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇవి ప్రజలకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఉదాహరణకు ప్రకాశం జిల్లాను తీసుకుంటే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి చీరాల పర్చూరు సంతనూతలపాడు నియోజక వర్గాలు ఉన్నాయి. పర్చూరు ,చీరాల మినహాయిస్తే మిగిలిన రెండు నియోజకవర్గాలు బాపట్ల జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటాయి.కానీ తాజాగా బాపట్ల జిల్లాలో పర్చూరు చీరాల ను మాత్రమే కలుపుతున్నట్లు జాబితా వెల్లడించింది.అద్దంకి సంతనూతలపాడు నియోజక వర్గాలను ఒంగోలు జిల్లా లో ఉంచేస్తారు.ఇది మంచి ప్రతిపాదనే.అలాగే ఒంగోలుకు చాలా దూరంగా ఉండే పశ్చిమ ప్రాంతాన్ని కవర్ చేస్తూ పొదిలి కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం కూడా ప్రజలకు బాగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.అలాగే ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఆ చుట్టుపక్కల ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలను చేరుస్తుారంటున్నారు.మొత్తంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ బాగానే ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు నిజం అన్నదే తేలాల్సిన విషయం.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju