రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధానికి తెరపడలేదు. ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తుండగా, ఉక్రెయిన్ .. అమెరికా సహా పలు దేశాల సహకారంతో అడ్డుకుంటూ రష్యా నిలువరిస్తొంది. తాజాగా ఈ వేళ రెండు దేశాల మధ్య మరో మారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడి పుతిన్ అధికారిక నివాసం క్రెమ్లిన్ పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను రష్యా కూల్చివేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను హతమార్చేందుకే వీటిని ప్రయోగించారని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్ పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా తెలిపింది. అంతే కాకుండా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా హెచ్చరించింది.

డ్రోన్ల దాడి నుండి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారనీ, ఆయనకు ఎలాంటి అపాయం కాలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. అలానే క్రెమ్లిన్ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్ర దాడి అని, అధ్యక్షుడి ప్రాణాలను హరించేందుకే పన్నిన కుట్ర అని ఆరోపించింది. డ్రోన్ దాడి జరిగినప్పుడు పుతిన్ ఆ భవనంలో లేరని పేర్కొంది. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మాస్కోలో డ్రోన్ల వినియోగంపై నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న మేము నిర్వహించే పరేడ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసిందని ఆరోపించింది. రష్యా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయనీ, శత్రువులు ఏ రూపంలో వచ్చినా ధీటుగా బదులిస్తామని రష్యా ప్రకటించింది. ఈ సంఘటన జరిగినప్పటికీ మే 9న విక్టరీ డే పరేడ్ మాస్కోలో ముందుకు సాగుతుందని క్రెమ్లిన్ తెలిపింది.
కాగా రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్ష ప్రతినిధి మిఖైలో పొడోల్యాక్ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ క్రెమ్లిన్ పై దాడి చేయదు. ఎందుకంటే ముందుగా అది ఎటువంటి సైనిక లక్ష్యాలను పరిష్కరించదు అని కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ తో 14 నెలల యుద్దంలో మరింత తీవ్రతరం కావడానికి మాస్కో ఈ విధంగా ఆరోపణలు చేస్తొందని ఆయన సూచించారు.
ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారుతుంది – సీఎం జగన్
The dome of the Kremlin was set on fire to celebrate Russia's Defeat Day@KremlinRussia_E@mod_russia#Moscow #Russia#Kyiv #Ukraine 🇺🇦#Kherson #Bakhmut pic.twitter.com/QORymzCZ34
— RakanSlmaan (@RakanSlmaan) May 3, 2023