న్యూస్

త‌లొగ్గిన ర‌ష్యా.. కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ డేటా సోమ‌వారం విడుద‌ల‌..

Share

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించి ఎలాంటి డేటాను విడుద‌ల చేయ‌కుండానే నేరుగా కోవిడ్ వ్యాక్సిన్‌ను విడుద‌ల చేసినందుకు ర‌ష్యా దేశం వైద్య నిపుణులు, ప్ర‌పంచ దేశాలు, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ల నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ర‌ష్యా నిర్ణ‌యించింది. తాము ఇటీవ‌ల విడుద‌ల చేసిన స్పుత్‌నిక్ వి క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటాను సోమ‌వారం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

russia to release its covid vaccine trials data on monday

స్పుత్‌నిక్ వి వ్యాక్సిన్‌కు ప్ర‌స్తుతం అక్క‌డ ఫేజ్ 3 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ట్ర‌య‌ల్స్ ముగియ‌కుండానే.. అంత‌కు ముందు చేప‌ట్టిన ట్ర‌య‌ల్స్ డేటాను విడుద‌ల చేయ‌కుండానే.. ర‌ష్యా వ్యాక్సిన్‌ను విడుద‌ల చేయ‌డంపై అనేకమంది సందేహాలు వ్య‌క్తం చేశారు. దీంతో వారి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అక్క‌డి టీఏఎస్ఎస్ అనే న్యూస్ ఏజెన్సీ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కోను కోట్ చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

కాగా ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ కోసం ఇప్ప‌టికే 20 దేశాలు 1 బిలియ‌న్ డోసుల‌కు ఆర్డ‌ర్లు ఇచ్చాయ‌ని ఆ దేశ ప్ర‌భుత్వం తెలిపింది. త‌మ వ్యాక్సిన్ పూర్తిగా సుర‌క్షిత‌మ‌ని, దాన్ని గ‌మాలియా ఇనిస్టిట్యూట్ అత్యంత నిపుణులైన సైంటిస్టుల బృందంచే త‌యారు చేయించింద‌ని.. అందువ‌ల్ల వ్యాక్సిన్ విష‌యంలో అన‌వ‌స‌ర అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని అక్క‌డి సైంటిస్టులు ఇప్ప‌టికే తెలిపారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా ఆ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ డేటాను విడుద‌ల చేస్తుండ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది.


Share

Related posts

చిత్తూరు జిల్లా లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ..!

Siva Prasad

BJP: త‌గ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంల‌పై …

sridhar

ఎస్పీ గిస్పీ జంతా నై!! ఈ అతి అనర్ధం జగన్!!

Comrade CHE