Anasuya: బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన అనసూయ.. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. యాంకర్ గా అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో దానికి రెండింతలు… సిల్వర్ స్క్రీన్ పై తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర చేసి విమర్శకులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. నటన పరంగా మాత్రమే కాక స్పెషల్ సాంగ్స్ లో కూడా… చిందులేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్లేస్ తాజాగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రిప్లై చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వెలువడుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే కింగ్ నాగార్జున అప్పట్లో నటించిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో ఐటెం సాంగ్ లో అనసూయ చిందులు వేయడం తెలిసిందే. నాగార్జునతో అనసూయ స్టెప్స్ వేయడంతో పాటు టైటిల్ సాంగ్ కావడంతో అనసూయ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్ అయ్యింది. ఇదిలా ఉంటే త్వరలో “సోగ్గాడే చిన్నినాయన” సీక్వెల్ నాగార్జున చేస్తూ ఉన్న నేపథ్యంలో… ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేత.. చిందులు వేయించడనికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
సిల్వర్ స్క్రీన్ పై అందాలు చూపించడంలో పాయల్ రాజ్ పుత్ ఇటీవల చెలరేగిపోతు ఉండటంతో… ఐటెం సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో… సోగ్గాడే చిన్నినాయన సినిమా ఐటమ్ సాంగ్ కి డబల్ హాట్ డోస్ సినిమా యూనిట్ బాలే పెంచారులే అని కామెంట్లు చేస్తున్నారు.