తెరుచుకున్న శబరిమల ఆలయం

71 views

శబరిమల, జనవరి 2: కేరళలోని శబరిమల ఆలయం శుద్ది త్వరాత తెరుచుకుంది. ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో బుధవారం ఉదయం సుమారు ఒక గంట సేపు పైగా ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుడి ఆదేశాలతో శాస్ర్తయుక్తంగా శుద్ది చేసిన తర్వాత ఆలయాన్ని తెరిచి భక్తుల సందర్శనానికి వీలు కల్పించారు.
ఆలయంలోకి మహిళలు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న సంఘటనపై అలయ నిర్వాహకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ శుద్ధి చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంఘటనపై పండలం రాజకుటీంబీకులు శశి వర్మ అసంత‌ప్తి వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలనీ, మార్చడానికి అంగీకరించమన్నారు.
కేరళకు చెందిన న్యాయవాది బిందు, సామాజిక కార్యకర్త కనకదుర్గలు తెల్లవారుజామున అయ్యప్ప ను దర్శించుకున్నారు. వీరి ప్రవేశంపైన బిజెపితోపాటుగా అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు అయ్యప్ప భక్తులు తెలిపారు.