శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

శబరిమల, జనవరి6: శబరిమలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయంలోకి  ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూత్వ సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు శబరిమల ప్రాంతంలో మహిళా జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించే విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న పినరయి విజయన్ సర్కారు వైఖరిపై బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా  మకర జ్యోతిని దర్శించు కోవాలనుకునే భక్తులు భయాందోళనలు చెందుతున్నారు