క్రికెట్ దేవుడి కోచ్ కన్నుమూత

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమాకాంత్ అచేకర్ కన్నుమూశారు. క్రికెట్ ప్రపంచానికి ఒక గొప్ప బ్యాట్స్ మన్ గా సచిన్ టెండూల్కర్ ను తయారు చేసిన కోచ్ గా అచేకర్ అందరికీ సుపరిచితుడు.

అచేకర్ వయస్సు 87 సంవత్సరాలు. వయస్సు సంబంధిత రుగ్మతలతో గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్న అచేకర్ ఈ రోజు కన్నుమూశారు. సచిన్ కు చిన్న తనంలో క్రికెట్ కోచింగ్ ఇచ్చిన అచేకర్ పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా. సచిన్ కే కాకుండా వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ అమ్రే, సమీర్ ధిఘే, బల్విందర్ సింగ్ సంధు వంటి మేటి క్రికెటర్లకు కూడా అచేకర్ కోచింగ్ ఇచ్చారు.