22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా షోలో స్టాండప్ కామెడీని ఇరగదీస్తున్న సద్దాం

saddam standup comedy in kushi kushiga show
Share

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ముఖ్య ఉద్దేశమే… స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులు పరిచయం చేయడం. నిజానికి.. తెలుగు బుల్లితెర మీద ఇప్పటికే చాలా స్టాండప్ కామెడీ షోలు వచ్చాయి కానీ… ఏ షో సక్సెస్ కాలేదు. స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. దీంతో స్టాండప్ కామెడీ గురించే అందరూ మరిచిపోయారు. అయితే… వేరే భాషల్లో స్టాండప్ కామెడీకి చాలా ఆదరణ లభిస్తుండటంతో… ఎలాగైనా మరోసారి తెలుగు ప్రేక్షకులకు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు మెగాబ్రదర్ నాగబాబు. అందుకే… తన సొంత యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు.

Kushi Kushiga : ఖుషీ ఖుషీగాలో కామెడీ కింగ్ సద్దాం

అయితే… ఈ షోకు చాలామంది కంటెస్టెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొందరిని సెలెక్ట్ చేసి వాళ్లలో స్టాండప్ కామెడీని చేయిస్తున్నారు నాగబాబు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ ను అప్ లోడ్ చేస్తున్నారు. ఒక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పూర్తయింది. తాజాగా గ్రాండ్ ఫినాలే రెండో ఎపిసోడ్ ను నాగబాబు విడుదల చేశారు.

గ్రాండ్ ఫినాలే రెండో ఎపిసోడ్ లో బొమ్మ అదిరింది కమెడియన్ సద్దాం కామెడీ హైలెట్ గా నిలవనుంది. అవును.. సద్దాం గురించి అందరికీ తెలిసిందే కదా. సద్దాం కామెడీ టైమింగ్, పంచ్ టైమింగ్ మామూలుగా ఉండదు. అటువంటి కమెడియన్… స్టాండప్ కామెడీ చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. రచ్చ రచ్చ చేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసి కాసేపు నవ్వుకోండి మరి.


Share

Related posts

ముద్దు పెట్టి ఏడు నెలలు జైలుపాలయ్యాడు.. ‘సింగపూర్’లో భారతీయుడి లీలలు!

Teja

Chandra Babu : బ్రేకింగ్ : తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

somaraju sharma

కలియుగంలో జరిగేవి ఇవే !

Sree matha