NewsOrbit
న్యూస్ హెల్త్

సూర్య గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయకండి

సూర్య గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయకండి

గ్రహణం సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని పెద్దలు చెబుతారు. గ్రహణ సమయంలో గర్భిణీలు కచ్చితంగా ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయొద్దు.. వీటితో పాటు.. ఇక అందరూ ఓం నమ నారాయణాయ అనే దైవనామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయా అనే మంత్రాలను జపించాలి. గ్రహణానికి ముందే గర్భిణీలు అన్ని పనులు పూర్తి చేసుకుని, ఆహారం తీసుకుని పడుకోవాలని.. ఆ సమయంలో కదలకుండా ముఖ్యంగా 3 నెలలోపు వారు కదలకుండా అలానే పడుకోవాలని సూచిస్తున్నారు.

 

సూర్య గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయకండి

గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల అందులో నుంచి కాస్మిక్ కిరణాలు హాని కలిగిస్తాయి. ఇవి పరిశోధనాత్మకంగా కూడా నిరూపితమయ్యాయి. ఈ కిరణాలు.. గర్భిణీలపై ప్రభావంతో చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

ఈ సమయాన్ని చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆరాటపడతారు. అయితే దీనిని వీక్షించొచ్చు కానీ, నేరుగా వీక్షించకూడదు – ఈ కిరణాలు చాలా శక్తివంతమైనవి . గ్రహణ సమయంలో సూర్యుడిని డైరెక్ట్ గా కనుక చూస్తె 100% చూపు పోయి గుడ్డివారు కావడం ఖాయం . ఈ విషయం సైన్సు కూడా చెబుతుంది. మన పూర్వీకులు ఋషులు ఈ విషయం పై రీసర్చ్ చేసి ఈ కిరణాల దుష్ప్రభావం నుండి సమాజాన్ని కాపాడాలని కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. అయితే వెనకటి వారు ఏదైనా దైవ సంబంధం అయితే కాస్త భయంతో నైనా ఆచరిస్తారని గ్రహణం ను చూస్తే పాపం – దోషం – అరిష్టం అని చెప్పి ఉంటారు.
వెనకటి కాలంలో విద్యుత్తు లేదు కనుక అందరి ఇంటి పై కప్పులకి సూర్య కిరణాలు ఇంట్లో పడే విధంగా పైకప్పులకి అద్దాలు ఏర్పాటు చేసేవారు. ఈ అద్దాల గుండా సూర్య కిరణాలు ఇంట్లోపడి వెలుతురు ఉండేది. అవే కిరణాలు గ్రహణ సమయంలో కూడా పడేవి కనుక గర్భిణీలు పడుకొని ఉండాలి ఎటూ తిరగకూడదు. వంట పాత్రల పైన దర్భలు పెట్టాలి అని చెప్పారు. అయితే కావాలని బయట తిరిగితే సున్నితమైన వారికి అందులో గర్భిణీలకు ఇంకా త్వరగా ప్రమాదం కలుగుతుంది. ఇంక దర్భల విషయం చూద్దాం.

ఇళ్ళల్లో శుభా శుభ కార్యాలకి వాడే దర్భలు చాలామందికి తెలిసే వుంటుంది.  గ్రహణం రోజున చాలామంది ఈ దర్బలని తాగే నీళ్ళమీదా, తినే వస్తువులమీదా, ఊరగాయలమీదా వేస్తారు.  కొందరు దీనిని ఎగతాళి చేస్తారు.  విక్రమ్ సారాబాయ్ పరిశోధనా  కేంద్రం చేసిన పరిశోధనలో గ్రహణ సమయంలో నీటి శ్రేష్టత తగ్గిపోతుందనీ, ఈ దర్భలవల్ల నీటి శ్రేష్టత పెరుగుతుందనీ కనుగొన్నారు.  వీటివల్ల మేలు జరుగుతోందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువు చేసిన తర్వాత ఈ పధ్ధతులు పాటించటం, పాటించకపోవటం అనేది మన ఇష్టాఇష్టాలమీద ఆధారపడి వుంటుంది.

శరీరంలో ఉండే పిండంపై పడుతుంది. ఆ పిండం అంగవైకల్యంగా పుడుతుంది. ఇది మూఢ నమ్మకం అనుకుటాంరు కాని కాదు…. గ్రహణ సమయంలో జంతువులు కూడా ఏవీ బయటకి రావు. గ్రహణం పూర్తయ్యే సమయానికి మాత్రం కుక…కాని, లేదా ఏవైనా ఒక పక్షి కాని ఆకాశంలో అలా తిరుగాడుతూ ఉంటుంది. గమనించగలరు. … గ్రహణం కనిపించినా, కనిపించక పోయినా దాని ప్రభావం మాత్రం ప్రకృతిపై తప్పనిసరిగా ఉండి తీరుతుంది.

సైన్స్ పరంగా చూస్తే గ్రహణం రోజున విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహారపదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యం గా గర్భిణి స్త్రీలు గ్రహణ కాలం లో బయటకు రాకూడదు, గ్రహణ సమయం లో వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం వల్ల గర్భస్త శిశువు మానసిక శారీరిక వైకల్యాలతో జన్మించే ప్రమాదం ఉంది. గ్రహణ సమయం లో ఇష్ట దైవానికి  సంబంధించిన స్తోత్రాలను లేదా నామ జపాన్ని చేయడం విశేష ఫలదాయకం. మిగిలిన వారు కూడా గ్రహణ సమయం లో వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పారు.

గర్భవతులకు గర్భంలో శిశువు “పిండం” ఎదుగుతున్న సమయంలో శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్‌ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారిని బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. గ్రహణం సమయంలో చేసే దైవ స్మరణ, జపం అనేక రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయనేది నమ్మకం.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju