Saffron : అమ్మాయి నెల తప్పింది అని తెలియగానే.. అటు అత్తగారు,ఇటు అమ్మ ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు బోలెడన్ని సలహాలు ,సూచనలు ,జాగ్రత్తలు చెప్తుంటారు. అందులో ముఖ్యమైనది కుంకుమ పువ్వు వాడమని మరి మరి చెబుతుంటారు. అది వాడడం వలన అందమైన పిల్లలు పుడతారని అంటుంటారు .. అసలు దీని వెనుకున్న సంగతి ఏమిటో తెలుసుకుందాం..
కుంకుమ పువ్వులో మన శరీరానికి సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయన్నది నిజం. కుంకుమ పువ్వు ను తీసుకోవడం వలన గర్భిణీ శరీరంలోని రక్త శుద్ధి జరుగుతుంది. కుంకుమ పవ్వులో మజిల్ రిలాక్సంట్ గుణాలు ఉండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనంపొందుతారు. ఈ క్రమంలో కడుపులో బిడ్డకు కూడా రక్త సరఫరా బాగా జరిగి పుట్టబోయే బిడ్డ చర్మం ఆరోగ్యంగా ఏర్పడుతుంది తప్ప కుంకుమ పువ్వు కు బిడ్డ రంగు కు ఎటువంటి సంబంధం లేదని సైంటిస్టులు దీనిమీద జరిపిన పరిశోధనలో బయటపడింది.
తల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే బిడ్డ యొక్క చర్మ రంగు ఆధారపడి ఉంటుందని ఆ పరిశోధనల యొక్క సారాంశం గా చెప్పుకోవచ్చు. మితిమీరి ఏది తిన్నా కూడా ప్రమాదమే.. అలాగే కుంకుమ పువ్వు కూడా పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం 10 గ్రాములకు మించకుండా గర్భిణీలు కుంకుమ పువ్వును తీసుకోవడం మంచిదట. లేదంటే దానితో కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గర్భం దాల్చిన 3వ నెల తరువాత నుంచి పాలలో కుంకుమ పువ్వును కలుపుకుని కాని, తినే ఆహార పదార్థాలలో కలిపి కానీ వాడవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పిల్లలు మంచి రంగుతో అందంగా పుడతారు అనేది ఎంత మాత్రం వాస్తవం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పుట్టబోయే పిల్లల ఆరోగ్య వంత మైన చర్మం కోసం ఇది వాడటం మంచిది .