Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కు డ్రైవింగ్ లైసెన్సు లేదా..? డీసీపీ ఏమన్నారంటే..?

Share

Sai Dharam Tej: సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందనీ, అపస్మారక స్థితి నుండి బయటపడ్డారనీ చెబుతున్నారు. అయితే ప్రమాద ఘటనపై ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ కు ద్విచక్ర వాహనం నడిపే డ్రైవింగ్ లైసెన్సు లేదన్నట్లు తెలుస్తోంది. తేజ్ వద్ద టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైెసెన్సు తమకు లభ్యం కాలేదని డీసీపీ తెలిపారు. లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ (కార్లు) చేసే లైసెన్సు మాత్రమే ఉందని తెలిపారు. టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Sai Dharam Tej driving licence issue
Sai Dharam Tej driving licence issue

ఘటన జరిగిన సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నారని పేర్కొన్న డీసీపీ 72 కిలో మీటర్ల స్పీడ్ తో బైక్ ను నడిపినట్లు గుర్తించామన్నారు. సాయి తేజ్ ఈ బైక్ ను ఎల్బీనగర్ కు చెందిన అనిల్ కుమార్ వద్ద నుండి కొనుగోలు చేశారనీ, ఈ బైక్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదన్నారు. దీనికి సంబంధించి అనిల్ కుమార్ ను పిలిపించి విచారించామన్నారు. బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. గతంలో ఈ బైక్ పై మాదాపూర్ లోని పర్వతాపూుర్ వద్ద ఓవర్ స్పీడ్ పై రూ.1,135 జరిమానా చలాన్ వేయగా దాన్ని ప్రమాదం జరిగిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి (తేజ్ అభిమాని) చెల్లించారన్నారు. సాయి తేజ్ ఆటోను ఎడమవైపు నుండి ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో స్కిడ్ అయి కిందపడ్డారని డీసీపీ తెలిపారు.


Share

Related posts

పవన్ కళ్యాణ్ జీరో అంటూ భారీ సెటైర్లు వేసిన కేఏ పాల్ ..!!

sekhar

కాజ‌ల్ బాలీవుడ్ చిత్రం

Siva Prasad

వింత కోణాలు, విదేశీ మూలాలు ; సుశాంత్ సింగ్ రాజపుత్ ది పక్క హత్య !!

Special Bureau