Sai dharam tej: రోడ్డు ప్రమాద ఘటన.. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

Share

Sai dharam tej: సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, 184 ఎంవి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజ్ ఆధారంగా ఘటన రాత్రి 8 గంటల 5 నిమిషాలకు జరిగినట్లు తెలుసుకున్నారు. ఘటనా స్థలం లో స్పోర్ట్స్ బైక్ ( ట్రంప్) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధరమ్ తేజ్‌ ను తొలుత దగ్గర లో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి మెగా బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి కి చేరుకున్నారు. మెడికవర్ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితి ఏమిలేదని తెలిపారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఏంట్రా వీళ్ళ ఓవర్ యాక్షన్? మెహబూబ్ ఎలిమినేషన్ పై సోహెల్ సెన్సేషనల్ కామెంట్స్

arun kanna

Trisha : మరోసారి మెగా హీరో పక్కన చెన్నై బ్యూటీ త్రిష..!!

sekhar

అఖిల్ 5 కి ఆ డైరెక్టర్ ఫిక్సైయ్యాడా ..?

GRK