Sai dharam tej: బాక్సాఫీస్ వద్ద అన్నదమ్ములకి భారీ పోటీ..మెగా సపోర్ట్ ఎవరికీ..?

Share

Sai dharam tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు యంగ్ హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలో రెండు సినిమాల ప్రమోషన్స్ త్వరలో మొదలవబోతున్నాయి. ఆ ఇద్దరు హీరోలే మెగా మేనళ్ళుళ్ళు సాయి ధరం తేజ్ – వైష్ణవ్ తేజ్. ఓ వారం గ్యాప్ లో ఈ ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో గత ఏడాది చివరిలో వచ్చిన సాయి తేజ్ త్వరలో ‘రిపబ్లిక్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్
గా తెరకెక్కుతుండగా, దేవ కట్టా రూపొందిస్తున్నాడు.

sai-dharam-tej-versus vaishnav tej
sai-dharam-tej-versus vaishnav tej

 

ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పిస్తుండగా, జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకం పై జె.భగవాన్, జె.పుల్లారావు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే కరోనా కారణంగా విడుదల ఆగిన ఈ మూవీని అక్టోబర్ 1న థియేట్రికల్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ఇటీవల ప్రకటించారు. నేచురల్ పర్ఫార్మర్ గా సౌత్ లో పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ‘రిపబ్లిక్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Sai dharam tej: ఒకే ఒక్క వారం గ్యాప్‌లో ఇద్దరు అన్నదమ్ములు

ఇక ‘ఉప్పెన’ సినిమాతో డెబ్యూ హీరోగా ఇండస్ట్రీ హిట్ అందుకున్న మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండవ సినిమాని సెట్స్ మీదకు తీసురావడం.. పూర్తి చేయడం జరిగిపోయాయి. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. షూటింగ్ అప్పుడెప్పుడో పూర్తవగా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ గురించి మేకర్స్ ఆలోచించలేదు. ఇక ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తుండగా, అక్టోబర్ 8న రిలీజ్ కి రెడీ
అవుతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. దాంతో ఒకే ఒక్క వారం గ్యాప్‌లో ఇద్దరు అన్నదమ్ములు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారని చెప్పుకుంటున్నారు. వీరిలో హిట్ అందుకునేది ఎవరో చూడాలి.


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 7th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

పెళ్లి బట్టల్లో రష్మిక .. ఇంత బాగుంది ఏంటి గురూ !

GRK

జేసీ కుటుంబానికి కష్టాలు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతున్నాయా?

sekhar