మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ‘ప్రతిరోజూ పండగే’తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న తేజ్ ఇప్పుడు సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ అయినా ఈ మూవీని ఇక రిలీజ్ చేయడమే మిగిలింది. ఈ క్రమంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి సాయి ధరమ్ తేజ్ అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో సినిమా హళ్లు తెరుచుకోలేదు.
ఇందువల్ల ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కొన్ని చిత్రాలు ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేక పోతున్నాయి. అందులో ఇంకా కరోనా పూర్తిగా తగ్గలేదు. ఈ సమయంలో చిత్రాలను రిలీజ్ చేస్తే ఆశించిన స్దాయిలో విజయాన్ని అందుకోకపోతే నష్టపోవడం ఖాయం అనే ఆలోచన కొందరిలో ఇంకా ఉందట. ఇలా ఉహించని విధంగా ఉన్న సమస్యల నడుమ ఈ నెలాఖరున హాళ్లు తెరుచుకోవడం పై అనేక సందేహాలున్నాయి. అయినా కానీ హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ టీమ్ మాత్రం హాళ్లు తెరుచుకుంటాయనే ధీమాతో డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
మిగతా వారు ఈ సమయంలో తమ సినిమాల రిలీజ్ విషయంలో ఆలోచిస్తుంటే ఈ చిత్రబృందం మాత్రం 25 న థియటర్స్ రిలీజ్ కి ఏమాత్రం తగ్గడం లేదు. ఇదే గనుక జరిగితే సాయి ధరం తేజ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని అభిమానులు సంబరపడుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లిరికల్ వీడియో సాంగ్స్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. అంతేకాదు ఈ సినిమాతో సాయి ధరం తేజ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.