Sai pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవి మంచి హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన డాన్సే కూడా. పర్ఫార్మెన్స్ పరంగా సాయి పల్లవిలో ఎంత నేచురాలిటీ కనిపిస్తుందో డాన్స్ పరంగా కూడా అంత నేచురాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్‌లో ది బెస్ట్ డాన్సర్ అన్నా, బెస్ట్ పర్ఫార్మర్ అయినా సాయి పల్లవి అని చెప్పాల్సిందే. మలయాళ హిట్ సినిమా ప్రేమమ్ లో నటించిన సాయి పల్లవి అందులోనూ డాన్సర్‌గానే నటించింది. తెలుగులో డాన్స్ షో ఢీ సీజన్లో పాల్గొన్న సాయి పల్లవి అప్పటి నుంచే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తమిళ, మలయాళ సినిమాల కంటే కూడా ఎక్కువగా తెలుగు సినిమాల మీదే ఫోకస్ పెట్టిన ఈ ఫిదా బ్యూటీ ఇక్కడ నుంచే క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన ఎంసీఎ, శర్వానంద్ సరసన పడి పడి లేచెమనసు చిత్రాలు చేసింది. ఈ సినిమాలలో సాయి పల్లవికి హీరోయిన్గా చాలామంది పేరు వచ్చింది. ఫిదా సినిమాలో వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ అలాగే ఎంసీఎ లో నానీ – చిన్నీ అనే సాంగ్స్ డాన్స్ పరంగా సాయి పల్లవికి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి.
Sai pallavi: సాయి పల్లవికి అలాంటి ఛాన్స్ వస్తే అద్భుతంగా చేస్తుంది.
ఇక ఇటీవల మరోసారి సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించాడు. ఇందులోని రెండు సాంగ్స్‌లో సాయి పల్లవి డాన్స్ చాలా హైలెట్‌గా నిలిచింది. సారంగ దరియా, ఎవో ఎవో కలలే సాంగ్స్‌లో సాయి పల్లవి చేసిన డాన్స్ గురించే ప్రేక్షకులందరూ ఎక్కువగా మాట్లాడుకున్నారు. లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకించి సాయి పల్లవి డాన్స్ గురించి, ఆమె పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు.. ప్రశంసించారు.
ఇంతగా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో పాటు స్టార్ హీరోలందరితోనూ, ఇటు అభిమానులు, ప్రేక్షకులతోనూ ప్రశంసలు అందుకుంటున్న సాయి పల్లవి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి షాకిచ్చారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో పూర్తి స్థాయి కామెడీ రోల్స్ చేయలేదని, కంప్లీట్ కామెడీ మూవీ చేయలేదని సాయి పల్లవి చెప్పుకొచింది. అదే సమయంలో తనకు ఈ సారి మంచి కామెడీ ఓరియెంటెడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. నిజంగా సాయి పల్లవికి అలాంటి ఛాన్స్ వస్తే అద్భుతంగా చేస్తుంది.
Sai pallavi: గ్లామర్‌గా కనిపించడానికి ఒప్పుకోదు.. అలాంటి అవకాశాలు ఇచ్చే దర్శకుడెవరో..?
అందులో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, ఇలాంటి కామెడి సినిమాలు చేసే దర్శకులు ఇప్పుడు ఉందంటే అనిల్ రావిపూడి, శ్రీను వైట్ల. వీరిద్దరి సినిమాలలో కామెడీ అద్భుతంగా ఉంటుంది. కానీ వీరి సినిమాలలో హీరోయిన్స్ గ్లామర్‌గా కనిపించాలి. కాస్త ఎక్స్‌ఫోజింగ్ చేయాలి. ఎఫ్ 2 లో తమన్నా, మెహ్రీన్‌లను చూస్తే తెలుస్తుంది. ఇక శ్రీను వైట్ల సినిమాలలో హీరోయిన్స్ కూడా ఎంత గ్లామర్‌గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి సాయి పల్లవి కోరిక తీరాలంటే ఈ ఇద్దరి సినిమాలలో చేస్తే సాధ్యపడుతుంది. కానీ ఆమె గ్లామర్‌గా కనిపించడానికి ఒప్పుకోదు. మరి అలాంటి అవకాశాలు ఇచ్చే దర్శకుడెవరో చూడాలి.