Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌తో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తన సినిమాల విషయంలో ఎక్కడా రాజీ పడదు. కథ తనకు నచ్చితేనే ఒప్పుకుంటుంది… నచ్చకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్తుంది. స్క్రిప్ట్ పరంగానే కాకుండా తన పాత్ర పరంగా కూడా అస్సలు రాజీ పడదు. అయితే ఒక విషయంలో మాత్రం ఆమె తప్పులు చేస్తోంది. దీంతో ఆమె సినిమాలకు దక్కాల్సిన గుర్తింపు గానీ స్పందన గానీ రావడం లేదు.
Sai Pallavi: సాయి పల్లవి చేస్తున్న పొరపాటు ఇదే
సాయి పల్లవి సినిమాల సెలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా అవి రిలీజ్ అయ్యే డేట్స్ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. స్టోరీ అద్భుతంగా ఉన్నా రిలీజ్ అయ్యే డేట్‌ని సరిగ్గా ఎంచుకోకపోవడంతో సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. ఈ విషయాన్ని సాయి పల్లవి ఇప్పటికీ గ్రహించలేకపోతోంది. ఆమె సినిమాలు సైలెంట్‌గా థియేటర్లకు వస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ యాక్ట్రెస్ సినిమాలను మిస్ అవుతున్నారు. పెద్ద స్టార్ హీరో సినిమా అయితే తప్ప ఆమె తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు చేసుకోకపోవడం గమనార్హం. గార్గి అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించిందని.. అది ఈనెల 14న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందనే విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. దీనికి కారణం మూవీ గురించి ఏమాత్రం ప్రమోషన్లు ప్లాన్ చేయకపోవడం. అలాగే ఇతర సినిమాలను దృష్టిలో పెట్టుకోకుండా రిలీజ్ డేట్‌ను హడావిడిగా ప్లాన్ చేయడం వల్ల సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతోంది. ఇలా రిలీజ్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సాయి పల్లవి కెరీర్ విజయవంతంగా సాగడం కష్టమే అని అభిమానులు అంటున్నారు.
విరాట పర్వం కూడా నిరాశే మిగిల్చింది
విరాట పర్వం సినిమా సాయి పల్లవి అట్టర్ ఫ్లాప్ అందించింది. ఈ సినిమా తర్వాత వచ్చే గారికి కూడా ఫ్లాప్ అయితే ఆమెకు ఒక హిట్టు కొట్టడం తప్పనిసరిగా మారుతుంది. హీరో శివ కార్తీకేయన్‌తో కలిసి సాయి పల్లవి నెక్స్ట్ మూవీ చేయనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఆ ఒక్క సినిమా తప్ప ఆమె చేతిలో ఇప్పుడు ఏ సినిమాలు లేకపోవడం గమనార్హం. మెగా స్టార్ హీరోయిన్ చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే కథలు నచ్చక వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేయడమే ఆమె చేతిలో ఎక్కువ సినిమాలు లేక పోవడానికి ప్రధాన కారణమేమో!