Sai Pallavi: అగ్ర కథానాయిక సాయి పల్లవి ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. ఈ ముద్దుగుమ్మ అల్లరి చేసే ‘భానుమతి’లా, అమాయకత్వం మూర్తిభవించిన ‘రోసీ’లా.. న్యాయం కోసం పోరాడే గార్గిలా ఏ పాత్రలోనైనా వదిగిపోయి ఆ పాత్ర మాత్రమే మన మనసుల్లో నిలిచిపోయేలా చేయగలదు. అంత గొప్ప నటి కాబట్టే ఈ అమ్మడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తార మల్టీ టాలెంటెడ్ కూడా. ఈమె డ్యాన్స్ చేసినట్లు ప్రస్తుత జనరేషన్లో ఏ హీరోయిన్ కూడా చేయలేదని చెప్పవచ్చు. ఒక్క నాట్యంలోనే కాదు, చదువుల్లోనూ ఈ ముద్దుగుమ్మ నంబర్ వన్.
Sai Pallavi: అదే ఆమె కెరీర్లో బెస్ట్
డాక్టర్‌గా, యాక్టర్‌గా, మంచి డ్యాన్సర్‌గా, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా సాయి పల్లవి అందరి హృదయాల్లో నిలిచిపోయింది. ఈ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలలో నటించి దేశమంతటా సహజ నటిగా ఖ్యాతి గడిచింది. ‘ప్రేమమ్’ మలయాళ సినిమాతో వెండితెరకు సుపరిచితమైన సాయి పల్లవి ‘ఫిదా’ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఒక అల్లరి పిల్లలా, తండ్రి గారాల కూతురిగా నటించి మెప్పించింది. ఫిదా తర్వాత వరుసగా తెలుగు సినిమాలతో అలరించింది. నటనకు ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకొని వరుసగా చాలా విజయలను కూడా అందుకుంది. ఇప్పుడు తెలుగు, మలయాళ భాషలలోనే కాకుండా తమిళంలోకూడా బిజీ అయిపోయింది.
ఆ ఒక్క విషయానికి మాత్రం నో!
ఎన్ని సినిమాల్లో నటించినా ఒక్క విషయానికి మాత్రం నో అనే చెబుతుంది సాయి పల్లవి. అదే స్కిన్ షో చేయడం. నటన అంటే గ్లామర్ చూపించడం మాత్రమే కాదనేది సాయి పల్లవి కాన్సెప్ట్. కాగా సాయి పల్లవి ఎప్పుడూ ఒకే రకమైన కథను సెలెక్ట్ చేసుకోవడం కొందరికీ నచ్చడం లేదు. ఈ అమ్మడు కావాలనే ఇలాంటి పాత్రలను ఎంచుకుంటుందని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది మాత్రం అనుకోకుండా ఆమెకి అలాంటి పాత్రలు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవలే సాయి పల్లవి ఈ విషయం గురించి స్పందించింది. ఆమె ఏదైనా ఒక పాత్రలో నటించేటప్పుడు నియమ నిబంధనలు ఏమి పెట్టుకోనని చెప్పింది. ఏ పాత్రలో నటించినా దానికి తగిన న్యాయం చేస్తానని పేర్కొంది.