Sai Pallavi: సాయి పల్లవి తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ వెండితెరకు కట్టిపడేస్తూనే ఉంటుంది. అనతికాలంలోనే ఈమెకు తెలుగులో చాలా మంది వీరాభిమానులు అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ లేడి పవర్ స్టార్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ క్యూట్ యాక్ట్రెస్ నటించే ప్రతి పాత్రలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. దాంతో ఆమెకి యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అభిమానులుగా మారారు. ఈ అగ్ర కథానాయిక ఎంత పేరొచ్చిన ఒదిగి ఉంటూ… ఎంత కష్టమైన పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే తెలుగు, తమిళ భాషలో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తుంటాయి.
ఇటీవల సాయి పల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వకపోయినా సాయి పల్లవి నటన సినీ ప్రేక్షకులు, విమర్శకులను ఒకేలా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె నటనలో ఒక మెట్టు పైకి ఎక్కింది. ప్రస్తుతం ‘గార్గి’ అనే లేడి ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 15న తమిళంతో పాటు మరి కొన్ని భాషలలో విడుదల కానుంది. ‘గార్గి’ సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టూ తిరుగుతుంది. ఉంటుంది. గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రమోషన్స్ చేసేందుకు సాయి పల్లవి బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సూర్య-జ్యోతికలకు గార్గి తమిళ్ వెర్షన్ చూపించింది. సినిమా నచ్చడంతో వారిద్దరూ ఈ మూవీని తమిళంలో ప్రజెంట్ చేస్తున్నారు. ఉదయనిది స్టాలిన్ కూడా ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సాయి పల్లవి వివరించింది. ఇక తెలుగులో రానా మూవీ ప్రమోషన్స్ బాధ్యతలు ఎత్తుకున్నాడు.
సాయి పల్లవి తాజాగా మాట్లాడుతూ… “గార్గి సినిమాకు సమర్పకురాలు (Presenter)గా నా పేరు వేస్తామని నిర్మాతలు అన్నారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. నా సినిమాకు నేను సమర్పకురాలు ఏంటి? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ సినిమాను నేనే నిర్మించి అప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాతగా మారతా.” అంటూ సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుత కాలంలో హీరోయిన్లు నిర్మాతలుగా మారటం కామన్ అయిపోయింది. కాబట్టి త్వరలోనే సాయి పల్లవి కూడా నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…