తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్థానంలో హాల్ మార్క్ చిత్రాలలో ‘అర్జున్ రెడ్డి’ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అలాగే ఈ చిత్రం ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యి మంచి విజయం సాధించింది. ఈ చిత్రం టాలీవుడ్ లో గేమ్ ఛేంజర్.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో కలిసి ఒక హాట్ సన్నివేశంలో నటించి కుర్రకారును హీటెక్కించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధ ఇటీవల కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు సోదరుడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇలా ఈ మధ్య ఆమె వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. అయితే తాజాగా మరోసారి ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో ఒక్కసారిగా సంచలనం గా మారింది.
అల్లరి రవిబాబు నటిస్తూ…. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘క్రష్’ కేవలం యూత్ నే టార్గెట్ చేస్తూ కుర్రకారుని పెట్టి సినిమా తీస్తున్న రవిబాబు దీనిలో హద్దులు దాటే అడల్ట్ కంటెంట్ ను పెట్టాడని ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పీక్ పేరుతో టీజర్ రిలీజ్ చూస్తేనే అర్థమైపోతుంది. సినిమా మొత్తం డబల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఉంటుందని హింట్లు ఇచ్చేసాడు.
అయితే దీనిలో సాయి సుధ పర్ఫామెన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. హాట్ హాట్ గా ఒకసారి యూట్యూబ్ లో తన చీరను జారవిడుస్తూ అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ బాడీ తో మత్తెక్కించిన ఈమె తన అందాలను చూపించిన తీరు…. పలికించిన హావాభావాలకు అందరి మతి పోగొడుతుంది. ఇక నటిగా గుర్తింపు కోసం తాపత్రయపడుతున్న సాయి సుధ కి ఈ మూవీ ప్లస్ కానుందా లేదా ఈ చిత్రం తర్వాత ఆమెకు ఎటువంటి అవకాశాలు వస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.