సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ టాక్ ఏంటీ ఇలా ఉంది ..?

Share

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా “సోలో బ్రతుకే సో బెటర్”. అంతక ముందు వరసగా ఫ్లాప్స్ ఉన్న సాయి తేజ్ చిత్ర లహరి”, “ప్రతీరోజూ పండగే” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు వరసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాతో భారీ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Sai Dharam Tej's 'Solo Brathuke So Better' likely to release in theatres soon | The News Minute

అంతేకాదు “సోలో బ్రతుకే సో బెటర్” టైటిల్ యూత్ కి విపరీతంగా కనెక్ట్ కావడం తో భారీగా అంచనాలు నెలకొనడమే కాదు భారీ హిట్ అందుకోవడం పక్కా అని ఫిక్సైయ్యారు. అందుకే సాయి తేజ్ కరోనా కారణంగా క్లిష్ఠ పరిస్థితులున్నప్పటికి డేర్ గా ఈ నెల 25 న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు డిసైడయ్యాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించాడు.

ఈ క్రమంలో కాస్త ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా “సోలో బ్రతుకే సో బెటర్” నుంచి చిత్ర బృందం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టైటిల్ తో యూత్ కు కనెక్ట్ అయిపోయిన సాయి తేజ్ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్ కు రప్పించడం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో మొదలైందట. ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఒక్కరికి తెగ నచ్చేసింది.లేటెస్ట్ గానే 50 లక్షల వ్యూస్ మార్క్ క్రాస్ మరిన్ని వ్యూస్ తో దూసుకుపోతుంది. అంతే కాకుండా లక్షకు పైగా లైక్స్ తో పాటుగా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచి ఈసారి సాయి తేజ్ కు మంచి విజయాన్నే అందించేలా కనిపిస్తుంది.


Share

Related posts

త్వరలో ఆ దేశంలో ఆకలి కేకలతో చావులు..??

sekhar

Hair Care: జుట్టు ఊడిపోయి బట్టతల అవుతుందని బాధపడుతున్నారా..ఈ చిట్కా వైద్యం ప్రయత్నించండి..

bharani jella

MP RRR Case: కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి ఎంపి రఘురామ కృష్ణం రాజు అరెస్టు వ్యవహారం..! ఎంపి తనయుడు భరత్ ఫిర్యాదు..!!

somaraju sharma