ఆదిపురుష్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అప్ డేట్స్ వింటున్నాం. రోజుకో అప్ డేట్. ఆ సినిమా అనౌన్స్ అవడమే ఆలస్యం.. ఆ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఆ సినిమా రేంజ్ అటువంటిది.
ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తుండగా.. ఏకకాలంలో హిందీ, తెలుగు సినిమాల్లో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే. ఈ సినిమా రామాయణ ఇతిహాసాన్ని బేస్ చేసుకొని రాబోతున్నది.
ఇక.. ఈ సినిమాలో సీత పాత్రలో చాలామంది హీరోయిన్లను మూవీ యూనిట్ సంప్రదించినప్పటికీ.. చివరకు కియరా అద్వానీని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా కీర్తి సురేశ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా పేర్లు వినపడ్డా.. దర్శకనిర్మాతలు చివరకు కియరాకే ఓటేసినట్టు సమాచారం.
ఇక.. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర రావణుడు. రామాయణంలో రాముడు ఎంతో ముఖ్యమో.. రావణుడు కూడా అంతే ముఖ్యం. అందుకే.. రాముడిని ఢీకొనబోయే వ్యక్తి కోసం మూవీ యూనిట్ చాలామంది నటులను అనుకున్నది. కానీ.. చివరికి సైఫ్ అలీ ఖాన్ ను రావణుడిగా తీసుకున్నారు. నిజానికి రావణుడిగా సైఫ్ నే తీసుకుంటున్నారు.. అని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ హీరో ప్రభాస్.. ఇవాళ ఫేస్ బుక్ వేదికగా సైఫ్.. లంకేష్ గా ఆదిపురుష్ లో నటిస్తున్నాడంటూ చెప్పేశాడు. దీంతో విలన్ రోల్ కు సంబంధించిన సస్పెన్స్ కు తెరపడింది.
అయితే.. ప్రభాసే విలన్ రోల్ ను రివీల్ చేయడంతో… సైఫ్ అలీ ఖాన్ ను విలన్ రోల్ కు తీసుకోవాలని ప్రభాసే సూచించాడంటూ వార్తలు వస్తున్నాయి.
నిజానికి సైఫ్ అలీ ఖాన్, ఓం రావత్ కలిసి తానాజీ సినిమాకు పనిచేశారు. తానాజీలోనూ సైఫ్ విలన్ రోల్ లో నటించారు. ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
అయితే.. ఆదిపురుష్ కు మళ్లీ సైఫ్ కు విలన్ రోల్ చాన్స్ వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. కానీ.. ప్రభాసే పట్టుబట్టి మరీ.. సైఫ్ నే ఈ క్యారెక్టర్ కోసం తీసుకోవాలని అన్నాడట. దీంతో మూవీ యూనిట్ కూడా సైఫ్ నే ఖాయం చేశారట.
అందుకే.. ప్రభాస్.. లంకేష్ క్యారెక్టర్ ను రివీల్ చేశాడు.. అంటూ బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా.. పెద్ద పెద్ద స్టార్లతో వస్తున్న ఈ సినిమా ఎటువంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇక.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక.. నాగ్ అశ్విన్ సినిమా ఉంటుంది. దాని తర్వాతే ఆదిపురుష్ పట్టాలకెక్కుతుంది. 2021లో ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం కానుండగా… 2022లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
https://www.facebook.com/ActorPrabhas/photos/a.382148915249322/2048049551992575/
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?