SAINMA: తెలుగు షార్ట్ ఫిల్మ్ రంగంలొ సరికొత్త సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సైన్మా పోరగాళ్ళు బ్యానర్ పై సందీప్ కండే నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన సఖి షార్ట్ ఫిలిం, యూట్యూబ్ లో తన మార్కు ను చాటుకుంటోంది. వేల వేల కళ్ళతోటి ఎదురేచూస్తున్నా అంటూ శుక్రవారం సాయంత్రం విడుదలైన సఖీ సాంగ్, మంచి వీవ్స్ సాధిస్తోంది. వినసొంపైన క్లీన్ మ్యూజిక్ తో సాగే ఈ పాటకు సింధూజ, ప్రవీణ్ వాయిస్ మంచి అసెట్ అయ్యింది. కాగా ప్రఖ్యాత బాంబో హట్ కంపెని వారు ఈ పాటను అందించారు.
తన ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించి ,ఆకాష్ కి దూరంగా పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్తుంది స్వేచ్చ. ఇద్దరూ జీవితంలో సెటిల్ అయ్యి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలరన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగాలని అనుకున్న స్వేచ్చ, ఆకాష్ తన కోసం వస్తాడని ఎదురుచూస్తూ, ప్రతీ క్షణం అతని ఆలోచనలతోనే కాలం గడుపుతూ ఉంటుంది. మరి తన అంచనాలను ఆకాష్ అందుకుంటాడా స్వేచ్చను చేరుకుంటాడా అనే కధంశంతో ముందుకుసాగుతోంది చిత్రం.
ఆకాష్ రెడ్డి పటోళ్ళ, శ్రీలీల హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ మద్దూరి రచన మరియు దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ఇక రాజ్ సింగ్ అందించిన చక్కటి సినిమాటోగ్రఫి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోండగా.. సురేష్ బానిసెట్టి లిరిక్స్ అందించారు. ఎడిటర్ గా ఎన్ వెంకటరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా నితుల్ వ్యాస్, శ్రీనివాస్ కొండపర్తి, మరియు నవీన్ వెంపటి వ్యవహరించారు. కాగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మరియు ధీమ్ సాంగ్ మంచి ప్రేక్షకాదరన పొందుతుండగా , ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న సైన్మాపోరగాల్లు యూట్యూబ్ ఛానెల్ వెదికగా ఈ చిత్రం విడుదల కానుంది.