Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ సాయి పల్లవి. ప్రారంభంలో మలయాళంలో సినిమాలు చేసిన.. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా”తో తెలుగు ప్రేక్షకులకు సాయిపల్లవి బాగా కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగింటి అమ్మాయి మాదిరి వస్త్రధారణ ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ కి అవకాశం ఇవ్వకుండా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ సక్సెస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల నేను దర్శకత్వంలో రానాతో విరాట పర్వము అనే సినిమా సాయి పల్లవి చేయటం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఇంకా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి పల్లవికి “లేడి పవర్ స్టార్” అనే ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ట్యాగ్ లైన్ తో ఆమెను పోల్చటం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజాగా లేడి పవర్ స్టార్ ట్యాగ్ లైన్ పై… సాయి పల్లవి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. పేరుకు ముందు ట్యాగ్ లైన్ ఉండటం ఇష్టం ఉండదని పేర్కొంది.
ప్రేక్షకుల ప్రేమ అభిమానులను దృష్టిలో పెట్టుకొని మంచి పాత్రలు చేయటంపై దృష్టి పెడతాను తప్ప.. ఇటువంటి ట్యాగ్ లైన్ లపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు అని పేర్కొంది. అభిమానులలో ఇంతటి క్రేజ్ రావటానికి గల కారణం.. సినిమాలో చేసిన పాత్ర లను ప్రేక్షకులు బాగా ఆదరించడం వల్లే అని స్పష్టం చేసింది. ఇటువంటి ట్యాగ్ లైన్ లు వలన కెరీర్ పరంగా ఒత్తిడి పెరిగిపోతుందని.. దీంతో చేస్తే పాత్రల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సాయి పల్లవి తనదైన శైలిలో లేడీ పవర్ స్టార్ ట్యాగ్ లైన్ పై.. రియాక్ట్ అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?