NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ రాజధాని గురించి కీలక విషయం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

Share

మొన్నామధ్య మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఉగాదికి విశాఖకు రాజధాని వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కామెంట్లు చేశారు. తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ నుండి చట్టపరంగా ఉగాది నుంచి పరిపాలన స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా బొత్స పేర్కొన్నారు. కాగా తాజాగా ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sajjala Ramakrishna Reddy dares TDP to seek CBI probe on Amaravatiఆయన ఏమన్నారంటే మరో నాలుగు నెలల్లో విశాఖ కి రాజధాని తరలింపు ప్రక్రియ ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావటంతో విశాఖ రాజధాని విషయంలో అంతా ఓకే అవకాశం ఉంది అన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

గత ఏడాది నవంబర్ మాసంలో ఏపీకి సంబంధించి మూడు రాజధానులు అంశం తెరపైకి రావడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందటం మాత్రమే కాక గవర్నర్ సంతకంగెజిట్ ప్రచురణ చకచకా జరిగిపోవడంతో గత ఏడాది మార్చి నెలాఖరు నుండి విశాఖ కు పరిపాలన రాజధాని తరలించారని జగన్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. ఇంతలోనే రాజధానిపై కోర్టులో పిటిషన్లు వేయటంతో ఈ తరలింపు కార్యక్రమాన్ని కోర్టు అడ్డుకోవడం జరిగింది. అయితే తాజాగా న్యాయ స్థానాల నుండి ఏపీ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు వస్తున్న నేపథ్యంలో.. విశాఖ రాజధాని విషయంలో కూడా శుభప్రదమైన తీర్పు వచ్చే అవకాశం ఉందని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖకు రాజధాని వెళితే మాత్రం జగన్ సర్కార్ చాలావరకు టిడిపి పై పైచేయి సాధించినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

Sasikala : శశికళ రాజకీయం సన్యాసం వెనుక అసలు కథ ఇదే..!? ఎందుకు అంత భయపడినట్టు..!?

Yandamuri

Today Horoscope నవంబర్ 27th శుక్రవారం రాశి ఫలాలు

Sree matha

ఏపి పరిపాలనా రాజధాని మూహూర్తం ఫిక్స్ అయినట్లే(గా)..! ఎప్పుడంటే..?

somaraju sharma