కోర్టులో లొంగిపోయిన సజ్జన్ కుమార్

కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్ కుమార్ కర్కర్ ధూమ్ కోర్టులో లొంగిపోయారు. సిక్కుల ఊచకోత కేసులో కోర్టు సజ్జన్ కుమార్ కు యావజ్జీవ ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే లొంగిపోవడానికి సమయం కోరిన ఆయన వినతికి కోర్టు తిరస్కరించింది. తనకు శిక్షపై సవాల్ చేస్తూ పై కోర్టును ఆశ్రయించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు.

1984 సిక్కు ఊచకోత కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సజ్జన్ కుమార్ ఈ రోజు తీహార్ జైలు అధికారులకు లొంగిపోనున్నారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ ఆయన కొద్ది సేపటి కిందట ఢిల్లీలోని కక్కర్ ధూమ్ కోర్టులో లొంగిపోయారు. ఆయనను వెంటనే మందోలీ జైలుకు తరలించారు.