NewsOrbit
న్యూస్

సండే స్పెషల్ : శకుని – పాచికలు కథ తెలుసుకోండి..!!

మనలో చాలా మందికి తెలుసు శకుని ఎవరో..! దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కారకుడయ్యాడు.
అయితే, ఇదంతా చేయడానికి అతని అసలు వ్యూహం వేరే ఉంది. అసలు అతను ఎప్పుడూ కౌరవుల మేలు కోరుకోలేదు. కౌరవుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే కురు వంశానికి చెందిన పాండవులు, కౌరవుల మధ్య యుద్ధాన్ని కోరుకున్నాడు…అసలు శకుని కురువంశం యొక్క నాశానాన్ని ఎందుకు కోరుకున్నాడు..? ఆ కథేంటో చూద్దాం…!

శకుని చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. శకుని అసలు పేరు “సుబలోత్తముడు” అంటే రాజు సుబలుడుకు చెందిన కొడుకులలో ఉత్తముడని అర్ధం. శకుని చిన్నప్పటినుండే చాలా తెలివిగల వాడు. వాస్తవానికి అతనికి అంగ వైకల్యం లేదు. చిన్నప్పుడు అతని తండ్రే అతడి తొడ ఎముక విరిచేశాడు.


శకుని గాంధారికి తమ్ముడు. గాంధారి జ్యోతిష్యం ప్రకారం ఆమెని ఎవరైతే మొదట వివాహం చేసుకుంటారో అతను వెంటనే మరణిస్తాడు. దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతుకిచ్చి పెళ్లి చేసారు. తరువాత ఆ మేక పోతుని చంపేశారు. ఈ రహస్యం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు. గాంధారి తండ్రయిన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి వంద మంది కొడుకులుండేవారు. గాంధారి ఒక్కటే కూతురు. అతను గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడికి చిన్నప్పటి నుంచే చూపు లేదు. తన భర్త చూడలేని ప్రపంచాన్ని తనూ చూడకూడదని గాంధారి నిర్ణయించుకుంది.
చివరకు ఒకరోజు గాంధారి మొదట వివాహ రహస్యం గురించి ధృతరాష్ట్రుడికి తెలిసింది. దీంతో చాలా ఆగ్రహానికి గురయిన ద్రితరాష్ట్రుడు మొత్తం సుబలుడి కుటుంబాన్ని చెరసాలలో బంధిస్తాడు. వాళ్లకి రోజూ గుప్పెడు అన్నం మాత్రమే పెట్టేవాడు. ఇదంతా తన కుటుంబాన్ని పస్తులుంచి చంపే ప్రణాళిక అని తెలుసుకున్న సుబలుడు, ఆ గుప్పెడు అన్నం అందరిలో చిన్న కొడుకైన శకునికి పెట్టేవాడు. అలా చేస్తే కనీసం అతనన్నా తన కుటుంబం యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడని తన చిన్న కొడుకుకే అన్నం పెట్టేవాడు.
తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకునిని విడిచిపెట్టాల్సిందిగా సుబలుడు ధృతరాష్ట్రుడిని వేడుకున్నాడు. గాంధారి కూడా తన తమ్ముడ్ని విడ్చిపెట్టాల్సిందిగా తన భర్తని వేడుకుంది. ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించాడు. చివరికి శకునిని చెరసాల నుండి విదిచిపెట్టాడు. అయితే అతను విడుదలయ్యే సమయానికి తన తోబుట్టువులందరూ చనిపోయారు. తన తండ్రి సుబలుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చెయ్యాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయాని శకునితో సబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత అతను కోరుకున్న విధంగానే కురు వంశం దాదాపుగా నాశనం అయిపొయింది. శ్రీకృష్ణుడు,పాండవులతో కలిపి మొత్తం 12 మంది మాత్రమే బ్రతికారు.

author avatar
Special Bureau

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N