Salaar Movie: “బాహుబలి” సినిమా విజయం తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా చేయడం కోసం చాలామంది ఇతర ఇండస్ట్రీకి చెందిన వాళ్లు క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అంతలా ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులు దాటేసింది. పరిస్థితి ఇలా ఉండగా కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. అటువంటిది వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు దాన్ని టైటిల్ “సలార్” Salaar Movie అని ప్రకటించడంతో.. ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా గ్యాంగ్ లీడర్ అనే వార్తలు రావడంతో సినిమా పోస్టర్ చూసి అభిమానులకు పూనకాలు తెప్పించినట్లయింది. మామూలుగానే ప్రశాంత్ నీల్ హీరో ని చూపించడం లో సినిమా థియేటర్ లో కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు రోమాలు నిక్కబొడుచుకునెలా చూపిస్తాడు అని అందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ని “సలార్” సినిమాలో ఎంట్రీ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాలో లేనివిధంగా బాహుబలి ని మించిపోయే రీతిలో డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క ప్రభాస్ ఎంట్రీ కోసమే సినిమాలో కొన్ని కోట్లు ఖర్చు చేసే రీతిలో సరికొత్త సెట్టింగ్స్ తో పాటు ఫైటర్స్ ని హాలీవుడ్ నుండి దింపినట్లు సమాచారం. సలార్ లో ప్రభాస్ ఎంట్రీ భారీ ఫైట్ అన్నట్లు, ఓ యాక్షన్ ఫిల్మ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లేదా క్లైమాక్స్ బ్యాంగ్ రేంజిలో ఉంటుందని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి ని తీసుకునే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం.