Salaar: సలార్ సినిమా షూట్ గురించి చెప్పకముందే టీజర్ మేలో విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ‘రాధే శ్యామ్’ సినిమా ప్లాప్ అవడంతో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. నెక్స్ట్ సినిమాలైనా హిట్ అవుతాయా లేదా అనే సందేహంలో వారు ఉన్నారు. ఆది పురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల అయ్యింది కానీ అది హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో అంతగా లేదు. కనీసం సలార్ మూవీ అయినా అలరిస్తుందో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. కాగా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేటట్లు కనిపించడం లేదు.
Salaar: సలార్ షూటింగ్ ప్రోగ్రెస్
మొన్నటి దాకా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ టీజర్ రిలీజ్ డేట్ త్వరలో ఏమైనా ప్రకటిస్తారా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇప్పుడు మే నెల వెళ్లి నాలుగు నెలలు దాటింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కూడా వచ్చేసింది. ఇంతలోనే ప్రభాస్ మోకాలికి ఆపరేషన్ జరగడం, ప్రభాస్ పెదనాన్న అయినా కృష్ణం రాజు కన్ను మూయడం చకచకా జరిగిపోయాయి. దాంతో సలార్ షూట్‌కి కాస్త బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు వృథా అయినా సమయాన్ని కవర్ చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.
ఇదే అప్డేట్
ఇటీవలే సలార్ సినిమా క్లైమాక్స్ గురించి ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడని టాక్. ఈ క్లైమాక్స్ ప్రభాస్ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, ఇంతవరకు ఎవరూ చేయని విధంగా, సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా సలార్ క్లైమాక్స్ ఉందని ప్రశాంత్ నీల్ చూపినట్లు వినికిడి. ఇక ఈరోజు ఉదయం సలార్ సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సలార్ టీమ్ తరుపున ప్రభాస్‌కి బర్త్‌డే రోజు ఏమైనా ట్రీట్ ఇస్తారా? లేకపోతే టీజర్ గురించి అప్డేట్ ఇస్తారా? అది కాకపోతే సలార్ గ్లిమ్స్ అంటున్నారు దానిగురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? అసలు దేనిగురించి అప్డేట్ ఇస్తారు అని ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ నిరాశ అయ్యింది. పృథ్వి పుట్టినరోజు సందర్భంగా అతని రోల్ ‘వరదరాజ మన్నార్’కి సంబంధించి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసి ఊరుకున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!