Salaries: జీతాలే సరిగ్గా ఇవ్వని కంపెనీలు కొన్నైతే, జీతం ఇచ్చినా బోనస్ ఇవ్వని కంపెనీలు కొన్ని, అలాగే బోనస్ ఇచ్చినా ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాం అనేక కంపెనీలు ఉన్న ఈ ప్రపంచంలో జీతంతో పాటు కొన్ని లక్షలు బోనస్ ఇచ్చే కంపెనీని లేదా కంపెనీ బాస్ ను ఎప్పుడైనా చూశారా..? చూడకపోయినా అలాంటి వారి గురించి వినకపోయినా ఇప్పుడు మాత్రం ఒక లేడీ బాస్ (lady boss) గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరి లేడీబాస్..? ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.? అయితే వెంటనే ఇటువైపు ఓ లుక్కేయండి.
AP Cabinet: ముగిసిన ఏపి కేబినెట్ భేటీ..! ఆమోదించిన కీలక నిర్ణయాలు ఇవే..!!
ఎవరు ఈ లేడీ బాస్:
అమెరికాకు చెందిన స్పానెక్స్ కంపెనీ యజమానురాలు అయిన సారా బ్లేక్లి అనే వ్యాపారవేత్త తన ఉద్యోగులకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. తన సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికిరూ. 7.5 లక్షలు ( lakhs) బోనస్(bonus) ఇచ్చి సర్ప్రైస్ చేశారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడి కైనా వెళ్లి వచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు (tickets) ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో తన కంపెనీ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు.
Arjuna Plant: అర్జున బెరడు తో ఆ సమస్యలు దూరం..!!
అందుకే ఇలా చేశాను అంటున్న లేడీ బాస్:
ఈ సందర్భంగా సారా బ్లేక్లి మాట్లాడుతూ.. ” ఈ క్షణాలను ఆస్వాదించేందుకు తాను వారికి ఈ ఆఫర్ ఇస్తున్నానని ఇందుకోసం ప్రతి ఉద్యోగి కి రెండు చొప్పున ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ మీరు ట్రిప్ కు వెళ్తే అక్కడ మంచి హోటల్ లో బస చేసి మంచి డిన్నర్ చేయాలని ఆకర్షణ కోసం మరో రూ. 7.5 లక్షలు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్షణాన్ని ప్రతి ఉద్యోగి వారి జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనిదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. లేడీ బాస్ సారా బ్లేక్లి ఇచ్చిన టికెట్లు డబ్బుతో తాము ప్రపంచాన్నే చుట్టే వస్తామంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Samantha – chaithu : చైతూకు ఊహించని షాక్ ఇచ్చిన సమంత..!
ఇంతకీ ఆ లేడీ బాస్ తన సంస్థలోని ఉద్యోగులకు ఎందుకు అంత భారీ ఆఫర్ ఇచ్చారంటే . ఒక మంచి కారణమే ఉంది. సారా కి చెందిన సంస్థకు బ్లాక్ స్టోన్ అనే మరో కంపెనీతో వ్యాపార ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పానెక్స్ లో మెజారిటీ వాటాను బ్లాక్ స్టోన్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 1.2 బిలియన్ డాలర్లు కాగా మనదేశంలో అయితే సుమారు రూ. 8.93 వేల కోట్లు అన్నమాట. అందుకే ఈ సంస్థలోని ఉద్యోగులకు సారా బ్లేక్లి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో సారా బ్లేక్లి ని తమ ఉద్యోగులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.