Salman khan: బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ స్టార్ హీరోలతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సల్మాన్ ఖాన్ తప్పకుండా మెగాస్టార్ ఇంటికి రాకుండా తిరిగి వెళ్ళడు. ఈ కారణంతోనే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, చిత్రబృందం నుంచి దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మాత్రం రావడం లేదు.
ఆ మధ్య సంగీత దర్శకుడు థమన్ కూడా మెగాస్టార్, సల్మాన్ కోసం ఒక అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేస్తున్నట్టు ..ఆ సాంగ్ పాడేందుకు పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌ను సంప్రదిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా ఇదే విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ కన్ఫర్మ్ చేశాడు. బాలీవుడ్లో సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటించిన ‘అంతిమ్’ సినిమా రిలీజ్ అయింది. ఇందులో తన బావమరిదితో కలిసి సల్మాన్ ఖాన్ కూడా నటించాడు.
Salman khan: సల్మాన్ ‘గాడ్ ఫాదర్’ లో నాకు రోల్ ఆఫర్ చేశారు.
ఈ నేపథ్యంలో ‘అంతిమ్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు తన సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చి సందడి చేశాడు సల్మాన్. అలాగే ఇప్పుడు కూడా వచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయబోతున్నట్టు వెల్లడించాడి. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ లతో తనకు మంచి బాండింగ్ ఉందని అన్న సల్మాన్ ‘గాడ్ ఫాదర్’ లో నాకు రోల్ ఆఫర్ చేశారు. ఆ రోల్ ఏంటో అడగలేదు కానీ.. ఎన్ని కాల్షీట్లు కావాలిని మాత్రం అడిగానని తెలిపాడు. ఇక ఇదే సందర్భంగా విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న సినిమాలోనూ సల్మాన్ నటించబోతున్నట్టు వెల్లడించాడు.