ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. సమంత చిన్నది కాదు.. తమన్నాను ఎలా ఆటపట్టించిందో చూడండి?

Sam Jam by samantha with Tamannaah Bhatia
Share

సమంత అక్కినేని. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పుడు హోస్ట్ గానూ అదరగొడుతోంది. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ 4 లో హోస్టింగ్ చేసి మామను మించిన కోడలు అనిపించుకుంది సమంత. తర్వాత.. ఆహాలో ఓ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేసే చాన్స్ ను దక్కించుకుంది.

Sam Jam by samantha with Tamannaah Bhatia
Sam Jam by samantha with Tamannaah Bhatia

ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్స్ కూడా చేసింది. విజయ్ దేవరకొండ, రానాతోనూ ఎపిసోడ్స్ చేసిన సామ్.. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాతో ఎపిసోడ్ చేసింది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే.. ఈ షోకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ ను ఆహా.. యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. సామ్, తమన్నా.. ఇద్దరూ షూట్ గ్యాప్ లో చాయ్ తాగుతూ.. గుసగుసలాడుకుంటారు. ఏదో సీక్రెట్ ను సామ్ కు సమంత చెబుతుంది. వెంటనే షూట్ కు టైమ్ అయింది అంటూ ఓ వ్యక్తి వచ్చి సమంతతో చెప్తాడు. వెంటనే ఓకే అంటూ సామ్ లేస్తుంది. ఆ తర్వాత తమన్నా.. ఇటువంటి ప్రశ్నలు మాత్రం అడగవు కదా.. అంటూ సామ్ ను అడిగింది. దీంతో.. లేదు లేదు.. ఇటువంటి ప్రశ్నలేవీ అడగను.. అంటూ చిన్నగా కెమెరా వైపు చూసి ఓ నవ్వు నవ్వి కన్ను కొట్టింది. వామ్మో.. సమంత చిన్నది కాదు.. తమన్నాను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఊపిరి ఆడకుండా చేసిందిగా.


Share

Related posts

Raja Sekhar : రాజశేఖర్ నీ డైరెక్ట్ చేయబోతున్న సెన్సేషనల్ లేడీ డైరెక్టర్..!!

sekhar

ఖబడ్దార్ ఇమ్రాన్ : నసీరుద్దీన్ షా

Siva Prasad

కొడాలి నాని ఏకు మేకు అవుతున్నాడా?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar