సామ్ జామ్ షో తెలుసు కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ షోనే ట్రెండింగ్. ఆహా ప్లాట్ ఫాంకు చెందిన ఈ షో ప్రారంభం అయి కొన్ని రోజులే అయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఎందుకంటే.. ఈ షోకు వచ్చేవాళ్లు మామూలోళ్లు కాదు. అలాగే.. షోను హోస్ట్ చేసేది కూడా అక్కినేని సమంత. అందుకే ఈ షోకు అంత హైప్. ప్రారంభం ప్రారంభమే విజయ్ దేవరకొండను ఈ షోకు తీసుకొచ్చి ఈ షోను ఒక్కసారిగా ఎక్కడికో తీసుకుపోయారు.

తర్వాత వరుసగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ షోకు వచ్చి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకు గెస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు.
అయితే.. 2020 సంవత్సరం మీకు ఏం నేర్పింది? అని సామ్.. చిరును అడగగా… ఈ సంవత్సరం నాకే కాదు.. ప్రపంచం మొత్తానికి గొప్ప పాఠాన్ని నేర్పింది. ప్రకృతిని కాపాడుకోవాలని నేర్పింది. నీటిని పొదుపు చేయాలని.. నీటిని ప్రిజర్వ్ చేసుకోవాలని నేర్పింది. మొక్కలను సంరక్షించుకోవాలి. మొత్తం మీద ప్రకృతిని కాపాడుకోకపోతే జీవితమే ఉండదు. మన భావితరాలకు ప్రకృతినే సంపదగా ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వాలి అని 2020 నేర్పింది.. అంటూ చిరు చెప్పుకొచ్చారు.
అలాగే.. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా ప్రకృతి గురించే మాట్లాడారు. అసలు ప్రకృతి గురించి ఎవ్వరికీ అవగాహన లేదన్నారు. ఇప్పుడు మనం ప్రకృతిని కాపాడుకోకపోతే వచ్చే తరాలు ఉండవు. ఈ జనరేషన్ మారాలి. ప్రతి ఒక్కరు మొక్కలపై అవగాహన పెంచుకోవాలి. చెట్లు నాటాలి. 100 ఏళ్ల క్రితం మంచినీళ్లను ఎవ్వరూ కొనుక్కొని తాగలేదు. కానీ.. ఇప్పుడు కొనుక్కొని తాగుతున్నాం. అలాగే ఒక 50 ఏళ్లు పోయాక.. ఆక్సీజన్ ను కూడా కొనుక్కొని బతకాల్సి వస్తుంది.. అంటూ అల్లు అర్జున్ అన్నారు.
మొత్తం మీద ఈ సంవత్సరం న్యూఇయర్ రిజల్యూషన్ గా మెగా ఫ్యామిలీ తన అభిమానులను ప్రకృతిని కాపాడాలంటూ కోరింది.