Samantha: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అదేరీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత విడాకుల వార్త సంచలనంగా మారింది. దాదాపు పదకొండు సంవత్సరాల కంటే ఎక్కువగానే కలిసి ఉన్న వీళ్ళు 4 సంవత్సరాల క్రితం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. తాజాగా ఇద్దరూ విడిపోవడం అభిమానులను ఎంతగానో నిరాశ కలిగించింది.
ఇదిలా ఉంటే ఇద్దరూ కూడా చర్చించుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్నేహపూర్వకంగా.. భవిష్యత్తులో ఉండాలనుకుంటునట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి అధికారిక వార్త రాకముందే సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో.. తన పేరును మార్చుకోవటం జరిగింది.
మళ్లీ సమంత రూత్ ప్రభుగా
తన హ్యాండిల్ నేమ్ గా “S” అనే అక్షరం మాత్రమే పెట్టడం జరిగింది. అయితే నాగచైతన్య తో పెళ్లయిన తర్వాత సమంత అక్కినేని అనే పేరు ఉండగా అంతకు ముందు సమంత రూత్ ప్రభు.. అనే హ్యాండిల్ నేమ్ ఉండేది. దాదాపు మూడు సంవత్సరాల పాటు సమంత అక్కినేని అనే కలిగిన పేరు ఇప్పుడు తాజాగా తీసుకున్న విడాకులతో.. మళ్లీ సమంత రూత్ ప్రభుగా మొదటి లో ఉన్న పేరును మళ్ళీ పెట్టి యధావిధిగా సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సమంత.. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు రక రకాలుగా స్పందిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ అభిమానులు
వీళ్లిద్దరు కు సంబంధించి విడాకులు వార్తలు వస్తున్న సమయంలో లో అలా జరగకూడదు కలిసి ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఇద్దరూ విడిపోవాలని.. నిర్ణయించుకోవడంతో.. పాటు ఈ టైంలో తమకు మద్దతుగా ఉండాలని తెలపటంతో చాలావరకు అభిమానులు బాధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో సమంత యధావిధిగా గతంలో మాదిరిగా తన సోషల్ మీడియా హ్యాండీల్ నేమ్ సమంత రూత్ ప్రభుగా మార్చడంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మరింతగా కృంగిపోతున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం గురించి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. బలమైన కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.