Samantha akkineni : టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నాగచైతన్య భార్య.. అక్కినేని కోడలు.. సమంత సినీ ఇండస్ట్రీకి పరిచయమై 11 సంవత్సరాలు.. ఈ సందర్భంగా ఆమె తాజా చిత్రం శాకుంతలం గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.. తెలుగులో ఏ మాయ చేశావే సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది.. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్ని ప్రేమించి, పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలు అయింది.. సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 11 సంవత్సరాలు అయినందున.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది..
సినిమా.. ఫస్ట్ లవ్ కదా అంత ఈజీగా తగ్గదు.. హ్యాపీ యానివర్సరీ టు మీ లెవెన్ ఇయర్స్.. టు యు ఆల్ ఆఫ్ యు జాయిన్ మీ ఇన్ థిస్ జర్నీ .. అంటూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో ని పోస్ట్ చేసింది.. అంతేకాకుండా ఏమాయ చేసావె .. సినిమాకు సంబంధించిన పన్నెండు పోస్టర్ల తో కూడిన ఒక ఫోటో ను కూడా పోస్ట్ చేశారు సమంత..
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు టాక్.. సమంత తన 11 ఏళ్ల కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర లో నటించనుంది. ఈ సినిమా కు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది.