Samantha Heroine: ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత రాజీ పాత్రలో జీవించేసింది. అసలు సమంత చేయబట్టే ఆ సిరీస్ అంతలా హిట్ అయిందని కొందరు అంటారు. కొందరు మాత్రం కథ బాగుండడం వల్లే ఎక్కువగా కనెక్ట్ అయిందని వాదిస్తారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత ఇరగదీసిందనేది వాస్తవం.
అందుకే అలా చేశా…
తాజాగా సమంత గోవాలో జరుగుతున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో సమంత (రాజీ) మాట్లాడుతూ.. ఏదో ఒకటి కొత్తగా ఉండాలనే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించినట్లు ఆమె తెలిపారు. ఇక ఈ సినిమా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో సమంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడింది. తమ సినిమాలోని పాత్రకు తమిళం తెలిసిన హీరోయిన్ ను తీసుకోవాలని భావించినట్లు అదే సమయంలో సమంత తమిళంలో చేసిన సూపర్ డీలక్స్ మరియు తెలుగులో చేసిన రంగస్థలం సినిమాలు చూశామని ఇక సమంతకే మొగ్గు చూపినట్లు వారు తెలిపారు.
నన్ను సంప్రదించకుండానే..
ఈ సిరీస్ లో ని యాక్షన్ పాత్ర కోసం రాజ్ అండ్ డీకే నన్ను కలవకుండానే ఎంచుకున్నారని సమంత తెలిపారు. ఇక వారు నన్ను కలిశాక కొత్త దనం కోసం పరితపిస్తున్న నేను ఆ పాత్రను ఠక్కున పట్టుకున్నానని ఆమె చెప్పింది. ఇక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పుకొచ్చింది. ఇక దర్శకద్వయం రాజ్ మరియు డీకేలు మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ కోసం ఇంకా కథను సిద్ధం చేయలేదని తెలిపారు. మీడియాలో అనుకున్నట్లు గా సిరీస్ ఉండదని పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని పేర్కొన్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!