ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చిన్న, పెద్ద మొత్తం కలిపి 12 వరకు సినిమాలు ఆగస్టు నెలలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఆగస్టులో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు మాత్రం సడన్‌గా తప్పుకున్నాయి. అందులో సమంత నటించిన ‘యశోద’ సినిమా ఒకటి కావడంతో ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
యశోద సినిమా డేట్ చేంజ్
సమంతకు నేను ఉన్నాను అంటున్న బాలీవుడ్ స్టార్… ఫుల్ ఖుషిలో సామ్ ఫ్యాన్స్..
యశోద సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్‌ను మార్చాలని ఆ చిత్ర బృందం నిర్ణయించుకున్నారని టాక్. సమంత నటించిన సినిమా థియేటర్లలో రాక చాలా రోజులు అవుతుంది. చిన్న చిన్న పాత్రలు చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి ఏమో కానీ ఆమె పెద్ద పాత్రలు చేసిన మూవీలో విడుదల కాకా చాలా రోజులైంది. దీనితో యశోద సినిమాతో సమంతను చూసి పండగ చేసుకోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. అంతేకాదు, యశోద సినిమా సక్సెస్ సాధిస్తే… సామ్ టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.
కొద్దిలో మిస్
ఆగస్ట్‌లో చాలా సినిమాలు విడుదలవుతున్న కారణంగా యశోద సినిమా సక్సెస్ అవుతుందా? అన్న భయంతోనూ యూనిట్ సభ్యులు ఆ సినిమా రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే నాగ చైతన్య నటించిన హిందీ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం ఆగస్ట్ 11న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ సామ్-చై మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చూడొచ్చని అనుకున్నారు. కానీ యశోద సినిమా వాయిదా పడటంతో ఈ వార్ చూడటం కొద్దిలో మిసయ్యామ్ అని సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లాల్ సింగ్ చద్దాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనుంది. లాల్ సింగ్ చద్దా, యశోద సినిమాలు ఒకే నెలలో రిలీజైతే కచ్చితంగా భారీ వార్ చూసి ఉండేవాళ్లమని కానీ ఇప్పుడు చైతూ, సామ్‌ల మధ్య ఇంట్రెస్టింగ్ వార్ మిస్ అయ్యామేనని తెగ బాధపడుతున్నారు.