Samantha : విడిపోయిన తరవాత సమంత – చైతన్య కలిసి చేసిన మొట్టమొదటి ఘనకార్యం ఇదే ?

samantha
Share

Samantha : పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి పరస్పర అంగీకారంతో విడిపోయాక సమంత, నాగచైతన్య తమ తదుపరి సినిమాలతో బిజీగా సమయం గడుపుతున్నారు. వీరిద్దరూ కూడా ఇప్పుడు ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో యాక్ట్ చేస్తున్నారు. అయితే వీళ్లు డివోర్స్ తీసుకున్న అనంతరం మొట్టమొదటగా ఓ పెద్ద ఘనకార్యం చేశారు. ఆ పని వల్ల ఒకామె బలైంది. దీని గురించి సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? వాళ్లు చేసిన ఘనకార్యం ఏంటి? దానివల్ల బలైన ఆమె ఎవరు? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

Samantha : ఆ ఘనకార్యం కారణమిదే

సామ్, చైతూ తమ విడాకులకు ముందు ఒక లేడీ డైరెక్టర్ తో చనువుగా మెదిలేవారు. భార్యాభర్తలుగా కలిసి ఉన్న సమయంలో ఆమెకు ఓ హామీ కూడా ఇచ్చారట. కానీ తీరా విడిపోయాక మొహం చాటేశారని.. ఆమెకు క్లియర్ గా హ్యాండ్ ఇచ్చారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ డైరెక్టర్ ఎవరు

చైతన్యతో పెళ్లి అయ్యాక సామ్ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండేది. అలాంటి టైంలో సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమా తీసి సూపర్ హిట్ అందుకుంది.  ఇది హిట్టయ్యాక నందినీరెడ్డి సామ్ వద్దకు వచ్చి నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేద్దాం అని చెప్పింది. కానీ చైతూ బిజీగా ఉండటంతో.. ఆ సినిమా ఆలోచన పక్కన పెట్టింది. తర్వాత నందిని సమంతకు ఓ బేబీ సినిమా కథ చెప్పింది. అలా వారిద్దరూ కలిసి ఓ బేబీ సినిమా తీసి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ టైంలో నందినీ, సామ్ మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహంతోనే సామ్ జామ్ అనే ఆహా ఓటీటీ టాక్ షో కూడా చేశారు. అప్పుడే నందిని చైతూ, సామ్ లతో ఓ మూవీ చేయాలనుకుంది.

Samantha : ఎలా హ్యాండ్ ఇచ్చారు

samantha
వాస్తవానికి 2013లో జబర్దస్త్ అనే సినిమాని నందినీ రెడ్డి తెరకెక్కించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. పెళ్లయిన తర్వాత వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. ఆ చనువుతో సమంత, నాగచైతన్య నందినితో కలిసి ఓ సినిమా చేసేందుకు ఓకే అన్నారట. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారు. దాంతో ఆమె వైపే చూడటం మానేశారు. కనీసం ఒక్కరితోనైనా సినిమా చేసే అవకాశం ఇవ్వండన్నా.. ఇద్దరు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదట. ఆ విధంగా వాళ్లిద్దరూ కలిసి నందిని రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అందుకు కారణం ఇదేనా

samantha

ప్రస్తుతం సమంత హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఎలాంటి పాత్ర చేయడానికైనా ఆమె సిద్ధంగా ఉంటోంది. ఇప్పటికే శాకుంతలం, యశోదా వంటి పెద్ద సినిమాలు చేసేస్తోంది. అలాంటప్పుడు నందిని రెడ్డితో కలిసి పిట్టకథలు వంటి చిన్న సినిమాలు ఎందుకు చేస్తుంది? ఒకవేళ చేయదలుచుకున్నా… ఆమె చేతులా నిండా ఇప్పుడు పెద్ద సినిమాలే ఉన్నాయి. అవన్నీ పూర్తి అయిన తర్వాత నందినితో సినిమా చేయొచ్చు. ఇక చైతూ కూడా చాలా బిజీగా ఉన్నాడు. థాంక్యూ, సర్కారు వారి పాట, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలతో పాటు ఓ అమెజాన్ ప్రైమ్ హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నాయని తాజాగా నాగచైతన్య ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అలా చెప్పడంతో నందినీ రెడ్డితో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు.


Share

Related posts

YS Sharmila షర్మిల పార్టీ ముహూర్తం ఖరారు..! ఇద్దరు సీఎంల మద్దతుతో సూపర్ ప్లాన్ తో సిద్ధం..!!

Srinivas Manem

KCR: బీజేపీకి ఎందుకు ఇలా దొరికిపోతున్నావు కేసీఆర్ సాబ్‌?

sridhar

Dimple hayathi : బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ అందుకున్న డింపుల్ హయాతి..! 

GRK