Samantha: సమంత.. తెలుగు తెరపైన ఓ అందమైన రూపమని చెప్పవచ్చు. అనతికాలంలోనే ఆమె ఇక్కడ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఏ మాయ చేసావే అంటూ యువత మనసుల్ని కొల్లగొట్టింది సమంత. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా A సెంటర్లలో నాన్ స్టాప్ గా ఆడింది. కాలేజీ కుర్రకారు ఈ సినిమాకోసం క్యూలు కట్టారు. అంతలా సమంత ఇందులో మేజిక్ చేసింది. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాను ఓ కావ్యంలాగా మలిచాడు. హీరో నాగ చైతన్యకు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా అయ్యింది.
వారి ఇద్దరి మనసులో (చే, సామ్) ఆ సినిమానుండే ప్రేమ వృక్షం చిగురించింది. ఫలితంగా 7 October 2017న వారు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మొన్నటి వరకు బాగానే వున్నారు. ఆదర్శమైన జంటగా వీరు ఉదాహరణగా నిలిచారు. కానీ ఇటీవల ఏం జరిగిందో తెలియదు. సడెన్ గా వారు విడిపోతూ అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు అయితే బాగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో సమంతను వారు బాగా ట్రోల్ చేసారు.
ఇక దొరికిందే అదనుగా కొన్ని సోషల్ మీడియా సంస్థలు పనిగట్టుకొని మరీ వీరి గురించి రూమర్స్ రాస్తున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో సమంత సూపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసినదే. విడాకుల అనంతరం సామ్ రకరకాల పోస్టులను కొటేషన్స్ రూపంలో షేర్ చేస్తోంది. వాటిని కూడా వీరు వదలడం లేదు. విడాకుల వ్యవహారం అనేది వారి వ్యక్తిగత వ్యవహారం కదా. మరి ఈ విషయం ఆ సో కాల్డ్ సంస్థలకు ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో మరి!
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…