సామ్ జామ్ షో తెలుసు కదా. ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ గా ప్రసారమవుతున్న సఓ. ఈ షో అప్పుడే ఫినాలేకు చేరుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసిన సమంత.. తాజాగా ఫినాలేలో తన భర్త నాగచైతన్యనే గెస్ట్ గా పిలిచింది.

అన్ని ఇంటర్వ్యూలు ఒక ఎత్తు అయితే.. ఈ ఇంటర్వ్యూ ఇంకో ఎత్తు. ఏ ప్రశ్న అడిగినా.. నాగ చైతన్య.. సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. పైగా సామ్ కే రివర్స్ గా ప్రశ్నలు అడిగాడు. ఎంతైనా భార్యభర్తలు కదా.. ఆ మాత్రం చనువు ఉంటుందిలే.
సామ్ కూడా ఈ ఇంటర్వ్యూలో చైని ఇబ్బంది పెట్టాలని.. చాలా ప్రశ్నలు వేసింది కానీ.. చైతన్య మాత్రం ఎక్కడా దొరకలేదు. దీంతో నాగ చైతన్యను ఎలాగైనా ఫిదా చేయాలని.. నా భర్త ఇవాళ మంచి మూడ్ లో ఉన్నారు.. అంటూ ఏదో చెప్పబోయింది. దీంతో.. నేను ఎప్పుడూ మంచి మూడ్ లోనే ఉంటా.. అంటూ నాగ చైతన్య అన్నాడు.
మొత్తం మీద టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా సాగిపోయింది సామ్ జామ్ ఇంటర్వ్యూ. దానికి సంబందించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..