Samantha : టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరుగాంచిన వారిలో సమంత, నాగ చైతన్య జంట కూడా ఒకటి. విరిద్దరు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. వీరి జంటను. చూడడానికి రెండు కళ్ళు చాలవు.. చూడ చక్కని జంట అని అనండంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. చూడ ముచ్చటగా ఉండే ఈ జంట కొన్ని అనివార్య కారణాల వలన విడాకుల తీసుకోవాలిసిన పరిస్థితులు వచ్చాయి. ఇద్దరూ కూడా పరస్పర అంగీకారంతో తమ ప్రేమకి, పెళ్ళికి వీడ్కోలు చెప్పుకుని విడాకులతో విడిపోయారు. విడాకులు తీసుకున్నాక వీరిద్దరి విడిపోవడానికి గల కారణాలు ఇవి… అవి అని. సోషల్. మీడియాలో రకరకాల రూమర్లు వచ్చాయి.
Samantha : విడాకుల అనంతరం సినిమాల్లో దూకుడు పెంచిన సామ్ :
ఇదిలా ఉండగా సామ్ నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సినిమాల్లో దూకుడు పెంచింది. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుని పోతుంది. మునుపటి కంటే రెట్టింపు ఉత్సహంతో వచ్చిన అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెగ బిజీ అయిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.మరోపక్క శాకుంతలం సినిమాను కూడా దాదాపు పూర్తి చేసేసింది సమంత. అలాగే యశోద అనే మరొక సినిమాను కూడా పట్టాలెక్కించేసింది.అయితే ఈ రెండు చిత్రాలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అవ్వడం గమనార్హం అనే చెప్పాలి.
Samantha : సామ్ కి క్రెజీ ఆఫర్ ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరంటే?
తాజాగా మళ్ళీ ఇప్పుడు సమంతకు మరో పెద్ద ఆఫర్ వచ్చిందనే వార్త సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతుంది. మాటల మాంత్రికుడుగా పేరు గాంచిన త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత మళ్ళీ తెరపై. కనిపించునుందని వార్తే దుమారం రేపుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత ఇప్పటికే మూడు బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు త్రివిక్రమ్ తో. కలిసి. పనిచేసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయే ఈ చిత్రం కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని, ఒక నవల ఆధారంగా ఈ సినిమా కథ తెరకేక్కించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సామ్ ఈ ఆఫర్ ను ఒప్పుకుంటుందా..?అసలు. ఇది. నిజమేనా.?
సామ్ చేతిలో ఇప్పటికే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడంతో సామ్ ఒప్పుకుంటుందా లేదా అనే విషయం పట్ల క్లారిటీ అయితే లేదు కానీ ఉన్నటుండి త్రివిక్రమ్ ఇంత అర్జెంటు గా ఈ ప్రాజెక్ట్ను టేకాఫ్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమా లేదు.మహేష్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు డేట్స్ దొరికే అవకాశాలు లేవు. సో ఈ గ్యాప్లో సమంతతో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు వినికిడి. అసలు ఈ వార్త ఎంత వరకు నిజం అనే విషయం అధికారిక ప్రకటన వస్తే గాని తెలియదు.!