Tollywood: ప్రస్తుతానికి ఆమె టైం బాలేదు అని కొందరు అంటున్నారు. చైతు నుండి డివోర్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆమె తప్పుడు నిర్ణయమే అని మరి కొందరు కూస్తున్నారు. సామ్ వెరీ ఆటిట్యూడ్ అని ఇంకొందరు ఆడి పోసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా ఎన్నో విమర్శలు ఆమెను చుట్టుముట్టాయి. కారణాలేవైనా కావచ్చు. ఆ విషయం మాత్రం పూర్తిగా ఆమె వ్యక్తిగతం. కానీ కొందరు కుహనా మేధావులు ఆమెను సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా వేధించడం మనం చూశాం.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శకులు ఎవరంటే?
అయితే, ‘నవ్విన నాపచేనే పండుతుంది’ అన్న మాదిరిగా.. అన్ని విమర్శల మధ్యన కూడా టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్, అక్కినేని మాజీ కోడలు అయినటువంటి సమంత.. బురదలో వికసించిన కమలం మాదిరిగా వెలుగొందుతోంది. సమంత ”ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో సమంత నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించి, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లైంగిక వివక్షకు ప్రభావితం అయ్యే సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించి, అందరిని విస్మయానికి గురయ్యేలా చేసింది. ఇకపోతే ఆమె నటనకు గాను ప్రశంసలతో పాటుగా పలు రకాల అవార్డులు దక్కుతున్నాయి.
ఈ వెబ్ సిరీస్ కి మరో అవార్డు కూడా లభించింది!
తాజాగా రాజీ పాత్రకు గాను సామ్ కు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్- 2021 లో డ్రామా సిరీస్ (ఫీమేల్) కేటగిరీలో సమంతకు ఈ అవార్డు లభించడం విశేషం. తాజాగా ముంబైలో జరిగిన ఫిలింఫేర్ అవార్డు వేడుకలో ఈ అవార్డు అందుకుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో సమంత కనబరిచిన అద్భుతమైన నటనకు ప్రతిష్టాత్మక IIFM-2021 అవార్డు కూడా వరించిన సంగతి మనకు తెలిసినదే. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. చైతు డివోర్స్ తరువాత కుంగిపోకుండా మరింత స్ట్రాంగ్ గా సమంత ముందుకు దూసుకుపోవడం మెచ్చుకోదగ్గ విషయమే.