న్యూస్

Samantha Divorce: సమంత విడాకులపై డైరెక్టర్ నందిని రెడ్డి అనూహ్య కామెంట్స్..

Share

Samantha Divorce: ప్రముఖ సినీ తార సమంత ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే హీరో అక్కినేని నాగ చైతన్యను మనువాడింది. వీరి చాలా కాలం పాటు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. అయినప్పటికీ వారి వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు. వీరి విడాకుల టాపిక్ చాలాకాలం పాటు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ సమంత డివోర్స్ టాపిక్ హాట్ టాపిక్ గానే ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే సమంతాకి ఆప్తురాలైన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు.

Samantha Divorce: అలా చెప్పుకొచ్చిన నందిని రెడ్డి

సమంతా, నందినిరెడ్డి కలిసి జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు చేశారు. ఈ సమయంలో వారు మంచి స్నేహితులయ్యారు. ఈ కారణంగానే తాజా ఇంటర్వ్యూ లో సమంత గురించి నందినిరెడ్డిని అడిగారు. సామ్ విడాకుల గురించి మీరేమంటారు, అది సరైన నిర్ణయమా కాదా? అని ఇంటర్వ్యూయర్ నందిని రెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ” సమంత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం దాదాపు ఒకే సమయంలో మూవీ కెరీర్ ప్రారంభించాం. కెరీర్ ప్రారంభంలోనే మేమిద్దరం కలిసి మూవీల కోసం పని చేశాం. అందుకే మా మధ్య ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. 2014 నుండి మా ఫ్రెండ్షిప్ ఎంతో హ్యాపీగా కొనసాగుతుంది. ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు తన పక్కనే అండగా ఉన్నాను. ఇంత సన్నిహిత్యం ఉన్నా కూడా ఆమె పర్సనల్ విషయాలకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు నేను అడగను. ఒక ఫ్రెండ్ గా ఆమెతో నేను ఎంతో సమయం గడుపుతాను. ఎన్నో ప్రశ్నలు అడుగుతాను. కానీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి నాకు అనవసరం. నిజానికి ఆమె ప్రైవేట్ లైఫ్ గురించి నేను పట్టించుకోను. సలహాలు కూడా ఇవ్వాలని అనుకోను. ఇక ఆమె పెళ్లి గురించి నాకు తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు.” అని నందినీరెడ్డి తెలిపింది.

డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్

నందిని రెడ్డి సమంత పెళ్లి విషయంలో ఏం జరిగింది అనేది చెబుతుందేమోనని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ లేడీ డైరెక్టర్ మాత్రం సమంత పెళ్లి గురించి గానీ విడాకుల గురించి గానీ ఎలాంటి కామెంట్లు చేయలేదు.


Share

Related posts

Bollywood: భంగపాటులో బాలీవుడ్.. అక్కడి హీరోయిన్లను లాగేసుకుంటున్న టాలీవుడ్!

Ram

బిగ్ బాస్ 4: తన ఇంట్లో మాటీవీలో బిగ్ బాస్ 4 చూస్తున్న శివబాలాజీ రియాక్షన్ ఏంటో తెలుసా..?? 

sekhar

Bheemla nayak: థమన్ ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్.. కొత్త రికార్డులు గ్యారెంటీ రాసి పెట్టుకోండి

GRK