Samantha : “జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు.. దూల తీర్చేస్తది!” అవును.. పూరి జగన్నాధ్ సరిగ్గా చెప్పాడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. పేదవాడినుండి ధనికుని వరకు ఇదే సూత్రం వర్తిస్తుందనేది అక్షర సత్యం. అయితే అలాంటి పరిస్థితుల్లో నెగ్గుకొచ్చిన వారే విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి. కెరీర్ ఆరంభానికి ముందు సమంత ఎన్నో కష్టాలు అనుభవించిందట. ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సామ్ లైఫ్ జర్నీలో జరిగిన కొన్ని సంఘటనలు వినండి.. ఆమె మాటల్లోనే..
Samantha : సమంత ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు!
రీసెంట్గా జరిగిన ఓ కార్యక్రమంలో సమంత చాలా ఎమోషనల్ అవుతూ ఈ విషయాలపై స్పందించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు మాత్రమే ఆమె చదువులో టాపర్‌గా నిలిచిందట. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో క్లాస్ టాప్ అయిన ఆమె, డబ్బులు లేని కారణంగా డిగ్రీలో జాయిన్ అవ్వలేదట. ఇక అప్పటి నుంచి ఏదో ఒక పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ కలం వెళ్లబుచ్చిందట. హీరోయిన్గా అవకాశాలు రాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు వెళ్లి, అక్కడికి వచ్చేపోయే గెస్ట్‌లకు వెల్కమ్ చెప్పే వుద్యోగం చేసేదట. అందుకుగాను రోజుకు 500 రూపాయలు ముట్టజెప్పేవారట.
మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..
ఒక్కోసారి డబ్బులు లేక రోజుకు ఒక్క పూట భోజనం చేసి రెండు పూటలు పస్తు వున్న రోజులు కూడా ఉన్నాయట. ఇక వాటిని తాళలేక మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే, కొందరు కుటుంబ సభ్యులు ఆమెను హేళన చేశారట. నీకిది అవసరమా అంటూ క్లాసులు పీకేవారట. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగేసి పట్టుదలతో ఈ రోజు ఈ స్థాయికి చేరిందట సమంత. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా ఈ విషయాలన్నీ సమంతనే స్వయంగా చెప్పడం గమనార్హం.