Samantha: అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సమంతపై కొందరు నెటిజన్లు, అక్కినేని అభిమనులు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా సమంత వాటిపై స్పందించింది.
Samantha: సమంత ఎమోషనల్ కామెంట్లు.. వింటేనే కన్నీళ్లు రావాల్సిందే.. !
తప్పుడు ప్రచారం చేయొద్దు..
అక్కినేని కుటుంబానికి వారసుడు ఇవ్వడం ఇష్టలేకనే సమంత చైతన్య నుంచి విడిపోయిందంటూ, పిల్లలు వద్దనుకోవడం సరికాదని, సమంతకు ఇతరులతో ఎఫైర్స్ ఉన్నాయని అంటూ రకరకాలుగా సమంతపై సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాలను సమంత ఖండించింది. తాను అవకాశవాదిని కాదని చెప్పింది. తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమంత మండిపడింది.
Samantha: టాలీవుడ్లో ఆ నిర్మాణ సంస్థలు అన్నీ సమంతను బ్యాన్ చేస్తాయా..! ఇకపై అవకాశాలు కావాలంటే..?
వ్యక్తిగత దాడులకు దిగొద్దు..
విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయమని, ఆ బాధ నుంచి ఇంకా తాను బయటపడలేకపోతున్నానని సమంత చెప్పింది. నాగచైతన్య నుంచి విడిపోయిన బాధ నుంచి తాను ఇంకా బయటపడకముందే తనపై కొందరు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. తనపై వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదని, అయితే, తన గురించి ఎవరు ఏమనుకున్నా తనకు ఏంకాదని, తనపై అస్సలు ప్రభావం పడబోదని సమంత పేర్కొంది. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచి, తనకు ధైర్యం చెప్పిన అందరికీ సమంత థాంక్స్ చెప్పింది. సమంత, నాగచైతన్య ఇద్దరూ కూడా ప్రొఫెషనల్ లైఫ్‌లో ముందుకు సాగతున్నారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మూవీ సక్సెస్‌ను చైతన్య ఎంజాయ్ చేస్తున్నాడు.
త్వరలో నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇకపోతే నాగచైతన్య త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నాగచైతన్య ‘బాలరాజు’ పాత్ర పోషించాడు. ఈ చిత్రం తర్వాత తండ్రి నాగార్జునతో కలిసి చైతన్య ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ చేయనున్నాడు. ఈ ఫిల్మ్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్. సమంత విషయానికొస్తే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసింది. మహా భారతంలోని ఆది పర్వం ఆధారంగా తెరకెక్కిన ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో సమంత లీడ్ రోల్ ప్లే చేసింది.
Samantha: విడాకులు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సారి టీవీ ముందుకి సమంత..??