Samantha: సమంత విడాకుల తర్వాత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమాలకి కూడా ఓకే చెప్పబోతోంది. ఇక పుష్ప సినిమాతో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా..? అనే ఐటం సాంగ్ తో సమంత పేరు మరోమారు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది.
Gudivada: గుడివాడలో గోవా క్యాసినో బ్యాచ్..!? ఏపిలో ఎవ్వరూ ఊహించని మార్పులు..!?
Samantha: ఫిట్ నెస్ పై సామ్ ఫోకస్..
సినిమాలతో పాటు మరోవైపు తన ఫిట్ నెస్ పైన కూడా సామ్ ఎప్పుడూ ఫోకస్ గానే ఉంటుంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను ఇప్పటికే సోషల్ మీడియాలో పలుసార్లు షేర్ చేసింది సమంత. సామ్ పోస్ట్ చేసిన వర్క్ అవుట్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇన్ స్టాలో సామ్ లో 75 కేజీల వెయిట్ ను ఎత్తుతున్న వీడియోను సామ్ షేర్ చేసింది ఆ వీడియోలో ‘నేను నిన్ను మిస్ చేశాను 75’ అంటూ ఆమె పోస్ట్ కింద రాసుకొచ్చింది.
Gudivada: గుడివాడలో గోవా క్యాసినో బ్యాచ్..!? ఏపిలో ఎవ్వరూ ఊహించని మార్పులు..!?
నిన్ను నిరాశపరచాలని లేదంటూ కాప్షన్..
ఆ తర్వాత 78 కేజీలు.. 80 కేజీల వెయిట్స్ ను లిఫ్ట్ చేస్తున్న వీడియోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 78 కేజీల వెయిట్ ను లిఫ్ట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నిన్ను నిరాశపరచాలని నాకు లేదు.. నేను రోజు త్వరగానే మేల్కొంటాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది సమంత. ఈ క్యాప్షన్ ను తన జిమ్ కోచ్ అయిన జునైద్ గురించి రాస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. ఇక సమంత ఒక బాలీవుడ్ సినిమాలో స్పై గా నటించనున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?