Samantha: అక్కినేని సమంత బయట ప్రపంచం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్న గాని కెరియర్ పరంగా.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లను మించి మరి అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఒకపక్క సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ మరోపక్క టాప్ వెబ్ సిరీస్ లో నటిస్తూ.. కరోనా లాంటి టైంలో కూడా దేశవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటు కెరియర్ కొనసాగిస్తోంది. ఫ్యామిలీ మెన్ 2 లో ఇటీవల నటించిన అదిరిపోయే యాక్టింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మైథిలాజికల్ ప్రాజెక్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే టైటిల్ రోల్ చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు బంపర్ ఆఫర్లు ఇండస్ట్రీలో అందుకున్నట్లు లేటెస్ట్ టాక్ వినపడుతోంది.
విషయంలోకి వెళితే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు ఓకే అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది పవన్ పుట్టినరోజు నాడు ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రకటించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్రలో అనేక పేర్లు వినపడుతున్నాయి. అయితే తాజాగా హరీశ్ శంకర్ సమంతని తీసుకోవడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. గతంలో సమంత పవన్ పక్కన నటించే అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
“అత్తారింటికి దారేది” సినిమా తరువాత మరో సినిమా ఆయనతో చేయాలని కూడా తన మనసులో మాట ఒక టైంలో బయటపెట్టింది. అయితే ఈసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో .. సమంతా కి హీరోయిన్ రోల్ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే కాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా పిరియాడిక్ సినిమాగా టైం మిషన్ తరహాలో తెరకెక్కబోయే.. పాన్ వరల్డ్ సినిమాలో సమంతా కి కీలకపాత్ర నాగ్ అశ్విన్ రాసినట్లు సమాచారం. గతంలో మహానటి సినిమాలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సమంత నటించడంతో చదువుతో ప్రభాస్ తో చేయబోయే సినిమాలో.. సమంత ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. రెండు సినిమాలు భారీ ప్రాజెక్టులు కావడంతో సమంత పేరు వినపడటంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.