మొత్తానికి సమంత చేయాల్సింది చేసేసింది.. ఇక మిగిలింది ఆ ఒక్కటే ..?

మజిలీ, ఓ బేబి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అక్కినేని సమంత నటించిన జాను బాగా డిసప్పాయింట్ చేసింది. హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాత దిల్ రాజు, హీరో శర్వానంద్ కి పెద్ద షాకిచ్చింది జాను. దాంతో సమంత మళ్ళీ తెలుగులో సినిమా కమిటవలేదు. మరోసారి నాగ చైతన్య తో కలిసి నటించేందుకు కథలు వింటుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. కాని ఇంకా ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు సమాచారం లేదు.

The Family Man Season 2: Samantha Akkineni to make her web debut with Manoj Bajpayee show

అయితే ఓ బేబి తో హిట్ ఇచ్చిన నందిని రెడ్డి తో మరోసారి సినిమా చేయబోతుందని సమంత తెలుగులో చేయబోయే నెస్క్ట్ సినిమా అదే అన్న వార్తలు మాత్రం వస్తున్నాయి. అంతేకాదు తమిళంలో రెండు సినిమాలు కమిటయినట్టుగాను తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఆ సినిమాల షూటింగ్స్ ఏవీ ప్రారంభం కాలేదు. ఇక సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 మాత్రం సక్సస్ ఫుల్ గా చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు.

మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తున్న సమంత ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే ఫ్యామిలీ మాన్ సీజన్ 1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తో సీజన్ 2 ని తెరకెక్కించారు మేకర్స్. తెలుగు వారైనా రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక ఇప్పటికే సమంత చిత్రీకరణ తో పాటు స్వయంగా తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలని కంప్లీట్ చేసింది.

కాగా త్వరలో ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.. అయితే సమంత తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ – ప్రియమణి – సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.